కుమారి ఆంటీ: సోషల్ మీడియా ఇంతగా దిగజారుతోందా?

తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ తెలియని వారుండరు. ఈ వీధి వ్యాపారి రాజకీయ చర్చకు కూడా దారి తీసింది. కుమారి ఆంటీ 13 ఏళ్లుగా హైదరాబాద్ లో స్ర్టీడ్ ఫుడ్ బిజినెనస్ చేస్తోంది. పలు రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో ఆమె భోజనం అందిస్తున్నారు. కొందరు ఫుడ్ లవర్స్, యూటూబ్యర్స్ కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేశారు. ఆమె రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో కుమారి ఆంటీ బిజినెస్ కు కస్టమర్లు మరింతగా పెరిగారు. కస్టమర్లకు తోడు అక్కడికి యూట్యూబర్లు అక్కడికి భారీగా చేరుకోవడంతో గందరగోళం నెలకొంది.  ఆమె వ్యాపారం చేస్తున్న ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా ఆమె వ్యాపారాన్ని మూసేయించారు. దీనిపై సాధారణ జనాలు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకొని మరలా కుమారీ ఆంటీ తన భోజన వ్యాపారాన్ని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేశారు.

కుమారీ ఆంటీ షాపు తొలగింపు రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు సాగింది.  కేవలం సోషల్ మీడియా మూలంగానే కుమారీ ఆంటీ ఇబ్బంది పడింది అనేది వాస్తవం. వ్యూస్ కోసం రకరకాల వీడియోలు చేస్తూ.. ఇప్పుడు ఆమె పక్కన ఉన్న హోటళ్లను వీడియోలు చేస్తున్నారు. నానా రకాల రచ్చ చేస్తున్నారు.

గతంలో ప్రింట్ మీడియా ను ప్రజలు బాగా ఆదరించేవారు. కానీ ఆ తర్వాత చూడటం తగ్గించేశారు.  కేబుల్ మీడియా.. శాటిలైట్ మీడియా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీడియా ప్రసారాలపై నమ్మకం సన్నగిల్లూతూ వస్తోంది. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కానీ యూ ట్యూబర్స్ కూడా సంచలనాల కోసం ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు చూపిస్తున్నారు.  కుమారీ ఆంటీ తరహా వాళ్లని ప్రమోట్ చేయడం కోసం ఇంకా కొంత మంది వీధి వ్యాపారుల దగ్గరికి వెళ్తే వాళ్లు మమ్మల్ని వదిలేయండి అంటూ చెప్పే వీడియోలు వైరల్ గా మారాయి. సోషల్ మీడియా ఈ స్థాయికి దిగజారిపోవడం అవసరమా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: