పవన్, బాబు కలసి బీజేపీ లెక్క తేల్చేశారా?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లగా ఆయనకు చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. అనంతరం  వారిద్దరూ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు సిద్ధం పేరిట సభలు నిర్వహిస్తూ జోరు మీద ఉంది.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన అభ్యర్థుల విషయంలో ఇరు పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా అభ్యర్థుల ప్రకటన చేపట్టాలని ఇరువురు భావిస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ కి దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ఆ పార్టీ సానుభూతి పరులే ధ్రువీకరిస్తున్నారు.  వాళ్ల అనుకూల మీడియా పెట్టిన పోస్టులను పరిశీలిస్తే.. స

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీకి వెళ్లనున్నాయి. ఎలాగైనా బీజేపీని కలుపుకొని ముందుకు సాగాలని ఆ రెండు  పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ నేతలు నేరుగా వచ్చి మాతో మాట్లాడితే పొత్తుల విషయంపై ఆలోచిస్తామని బీజేపీ అధిష్ఠానం చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై చంద్రబాబు విముఖత  చూపారంట. అందుకే పవన్ కల్యాణ్ కు ఆ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.

ఆదివారం జరిగిన భేటీలో ఎక్కువగా ఈ అంశమే చర్చకు వచ్చింది. పొత్తుల విషయంపై స్పష్టత వస్తే సీట్ల సంఖ్యను తేల్చవచ్చు. దీనిపై మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలవనున్నారు. చర్చలు సఫలమైతే ఉమ్మడి మ్యానిఫెస్టో తో పాటు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.  బీజేపీకి రెండు ఎంపీ, ఏడు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇటీవల పోటాపోటీ సీట్ల ప్రకటన తర్వాత ఇరు పార్టీల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొంది. తాజా భేటీలో ఇద్దరు సయోధ్య కుదిరింది. ముందు బీజేపీ విషయం తేల్చుకొని కలిసి అడుగులు వేద్దామని భేటీలో నిర్ణయించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: