మాటనిలబెట్టుకున్న జగన్.. మరి ఓట్లు పడేనా?

ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే జనాల్లో విశ్వసనీయత ఉంటుంది. 2014  ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా రుణాలతో పాటు బంగారం, రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు. అది నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే తీరా రుణమాఫీని అమలు చేయకుండా చేతులెత్తేశారు. చిట్ట చివరన పసుపు కుంకం పథకం పెట్టి కొంతమంది మహిళలకు రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.  

దీంతో సంపూర్ణ రుణమాఫీ చేయలేదని ఆగ్రహించిన ప్రజలు ప్రజలు 2019లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు.  2019 లో జగన్ మోహన్ రెడ్డి విడతల వారీగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించారు. ఇది అంత హైలెట్ కాకపోయినా ఇచ్చిన మాట ప్రకారం తీరుస్తూ వస్తున్నారు.  ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ఎక్కడా కూడా కులం, మతం, ప్రాంతం, వర్గం చివరకు తమ పార్టీకి ఓటు వేయని వారికి సైతం లబ్ధి చేకూరుస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులను ఇటీవల విడుదల చేశారు. బటన్ నొక్కి సుమారు 79లక్షల మంది పొదుపు మహిళల ఖాతాల్లో రూ.6394.83 కోట్లు జమ చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు గద్దెనెక్కి ఆ తర్వాత దానిని చెత్తబుట్టలో పడేశారు. 2016లో సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశారని మండిపడ్డారు.

తాను మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మూడు దఫాల్లో రూ.19176 కోట్లు ఇచ్చానని..ఇవాళ నాలుగో విడతతో కలుపుకొని రూ.25570 కోట్లను నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. దీంతో పాటు పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్షరాస్యతలో పెరుగుదల, వారి ఆదాయంలో వృద్ధి, రాజకీయంగా వాటా తదితర అంశాల్లో గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందకు సీఎం జగన్  అన్నీ హామీలను అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: