ప్రపంచ రికార్డులకెక్కిన అయోధ్య రాముడు?

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎందో రామ భక్తుల పోరాటం తర్వాత రాముడి పురిటి గడ్డ అయిన అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నారు. వేలాది మంది భక్తులు, వందలాది మంది ముఖ్య అతిథులు మధ్య నరేంద్ర మోదీ సారథ్యంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ క్రతువును అన్ని న్యూస్ ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రాంతీయ, జాతీయ మీడియా అనే భేదం లేకుండా రాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాలు పంచుకొన్నాయి.

ఇక సోషల్ మీడియాలోను రాముడు అత్యంత చర్చనీయాంశంగా వినతికెక్కాడు. అయితే ఈ రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర  మోదీ రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించి.. తొలి హారతి ఇచ్చారు. విగ్రహం ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ఉద్వేగంగా మాట్లాడారు. అనేక ప్రశ్నలకు రాముడు మాత్రమే సమాధానం అని.. ప్రతి ఒక్కరిలోను శ్రీరాముడు ఉన్నారనిచేసే పనికి సంబంధించి కట్టుకునే కంకణంలోను ఉన్నారని పేర్కొన్నారు.

అయితే గూగుల్ ట్రెండ్స్ లోను అయోధ్య బాలరాముడు చర్చనీయాంశంగా మారాడు. మొదటి 20 అంశాల్లో దాదాపు 19 అంశాల్లో అయోధ్య కి సంబంధించిన వాటినే నెటిజన్లు శోధించారు.  దీంతో పాటు మరో అరుదైన రికార్డును అయోధ్య రాముడు తన  పేరున లిఖించుకున్నారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి దేశం దాటి ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చి చేరాయి. కాగా ఇప్పటి వరకు రామ మందిర నిర్మాణానికి రూ.1,100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలుపుతున్నారు.

అయితే భారత దేశంలోని ప్రతి గ్రామం నుంచి అయోధ్య రామునికి విరాళాలు వెళ్లాయంట.  దాదాపు 5లక్షల గ్రామాల నుంచి అది రూపాయి కావొచ్చు రూ.లక్ష కావొచ్చు  విరాళాలు వెళ్లాయి. విరాళాల కార్యక్రమంలో ఇంత మొత్తంలో భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. దీంతో పాటు 13 కోట్ల కుటుంబాలు ఇందులో పాలుపంచుకొన్నారు.  20లక్షల మంది వాలంటీర్లు పనిచేసిన అతిపెద్ద కార్యక్రమంగా అయోధ్య రికార్డుల కెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: