మోదీ.. ఇవి విజయాలా.. వైఫల్యాలా?

కొందరు నేతలు ప్రజల మనసులో చిరకాలం నిలిచి పోతుంటారు. మరణించినా కూడా  వారు చేసిన సేవలు మరిచిపోరు. ఆ రేంజ్లో అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్ సజీవంగా  ఉన్న సందర్భంలో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించారు.  ఆయనే కాదు వైఎస్సార్ కూడా ఊహించని రేంజ్ లో అభిమానులసు సంపాదించారు. అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధానిగా రెండు సార్లు దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన నేత నరేంద్ర మోదీ. వరుసగా రెండుసార్లు కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దేశం మొత్తం అయోధ్య రామమందిరం గురించి చర్చించుకుంటోంది.  దీనికి నరేంద్ర మోదీ అన్నీ తానై వ్యవహరించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ సమయంలో కేంద్ర బిందువుగా కనిపించారు.  ఇంతవరకు బాగానే  ఉన్నా అభివృద్ధి అంటే గుడులు కట్టడమేనా అని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే ప్రధాని చేసిన పనులను ఒక్కసారి మనం గమనించినట్లయితే.. ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు, జీఎస్టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సాహోసేపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతే కాక యూనిఫాక్ సివిల్ కోడ్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మెజార్టీ ప్రజల మెడపై కత్తిలా వేలాడుతున్న అనేక దుష్ట చట్టాలను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తున్నారు.

కరోనా సమయంలో అగ్ర దేశాలైన  అమెరికా, బ్రిటన్, చైనా అల్లాడుతుంటే భారత్ లో మాత్రం రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించారు. ఇది కేవలం భారత్ లోనే సాధ్యమైంది. దీంతో పాటు పేదల కడుపు నింపేందుకు ఉచిత రేషన్ బియ్యం విధానాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని రానున్న ఐదేళ్ల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉచిత వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్, చిన్నారుల చదువు కోసం సర్వ శిక్షా అభియాన్ తో పాటు ప్రధాని గా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించారు. వీటిని మనం అంగీకరించాల్సిన వాస్తవాలు అని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: