జగన్‌కు వరుస దెబ్బలు.. ఓటమికి సంకేతమా?

వైసీపీకి మరో షాక్ తగిలింది.  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంత కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతోనే కలత చెంది ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.  హైకమాండ్ చర్యలతో విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వల్లభనేని బాల శౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు.

అయితే నరసారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును ఈ సారి సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరింది. అయితే దీనిపై ఆయన సుముఖంగా లేరు. గత నాలుగున్నరేళ్లుగా ఆయన తన పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేపట్టారు. నేరుగా దిల్లీ పెద్దలతో పరిచయాలు ఏర్పరుచుకొని ఎంపీ ల్యాండ్ నిధులు తీసుకువచ్చారు. తన పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తూ వస్తున్నారు.  కీలక సమస్యలకు పరిష్కారం చూపారని కూడా లావుకు మంచి పేరుంది.

అయితే ఆయన ఈ సారి పక్కన పెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఈ సారి గుంటూరు నుంచి పోటీ చేయించాలని జగన్ భావించారు. గుంటూరు సీటు ఇస్తామని చెప్పి క్రికెటర్ అంబటిరాయుడిని పార్టీలోకి రప్పించారు. పార్టీలో చేరిన తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పించారు. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనను గుంటూరు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని చెప్పడంతో షాక్ అయిన అంబటి వెంటనే పార్టీకి గుడ్ బై చెప్పారు.

నరసారావుపేట నుంచి ఈ సారి బీసీ అభ్యర్థిని దించాలని వైసీపీ భావిస్తోంది. అందుకే లావు పార్టీకి రాజీనామా చేశారని సమాచారం. కాగా ఆయన కొంతకాలంగా పార్టీ హైకమాండ్ పై ఆగ్రహంగా ఉన్నారు. లోక్ సభ పరిధిలోని మోజార్టీ ఎమ్మెల్యేలతో ఈయనకు పొసగడం లేదు. కాకపోతే ఆయన చంద్రబాబు, లోకేశ్ తో భేటీ అయ్యారని టీడీపీలోచేరడం ఖాయమని ఈ మేరకు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: