ఇజ్రాయెల్‌.. ఇండియా వైఖరి మారిందా?

అరబ్ దేశాల్లో చాలా వరకు తీవ్రవాద దేశాలే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్క తీవ్రవాద దేశానికి 57 దేశాలు మద్దతుగా ఉన్నాయి.  హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై జరిపిన అత్యంత దారుణమైన దాడిని ప్రారంభంలో ఈ దేశాలన్నీ ఖండించాయి.  ఆ తర్వాత ఈ అంశంపై నోరు మెదపలేదు. ఈ అంశాన్నీ సీరియస్ గా తీసుకోలేదు. ఈ ఘటనకు ప్రతిగా ఇజ్రాయెల్ చేసిన దాడిపై మాత్రం అన్నీ ముస్లిం దేశాలు ఏకతాటిపై నిలబడి ముక్తకంఠంతో బెదిరించాయి.  ఈ దాడి ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు సైతం జారీ చేశాయి.  దీనిపై ఖండించాలని ఐక్య రాజ్య సమితిలో కూడా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టాయి.  పాలస్తీనా పై ఇజ్రాయెల్  చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం..  అక్కడ సాధారణ పౌరులు, మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలను చనిపోతున్నారు. ఈ మానవత్వ రాహిత్య చర్యలను ఖండిస్తున్నాం అని తీర్మానం ప్రవేశపెట్టారు.

 
అయితే ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులపై దాడి చేస్తోందని కానీ.. హమాస్ మిలిటెంట్లు ముందుగా ఇజ్రాయెల్ పై దాడి చేసినందుకు ప్రతిగా ఈ దాడులు చేస్తోందని కానీ ఈ తీర్మానంలో ఎక్కడా పొందుపరచలేదు.  ఇది  చెడును విస్మరించడమేనని వ్యాఖ్యానిస్తూ అమెరికా, ఇజ్రాయెల్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.  భారత్ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓటింగ్ కు దూరంగా ఉంది.


పౌరులను రక్షించడం, చట్టపరమైన మావనతా బాధ్యతలను సమర్థించడం అనే తీర్మానాన్ని జోర్డాన్ ప్రతిపాదించారు. అయితే ఇందులో ఎక్కడా కూడా హమాస్ దాడి గురించి ప్రస్తావించలేదు.  దీనికి బంగ్లాదేశ్, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా సహా 40 దేశాలు మద్దతుగా నిలిచాయి.  భారత్ తో పాటు ఆస్ర్టేలియా, కెనడా జర్మనీ, జపాన్, ఉక్రెయిన్ యూకేతో పాటు పలు దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు వేయగా.. 14 దేశాలు వ్యతిరేకించాయి.  హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాలని కెనడా తీర్మానించింది. ఈ ప్రతిపాదనకు భారత్ మద్దతిచ్చినా తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆమోదం పొందలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: