జనసేన.. తెలంగాణ సంచలనం సృష్టిస్తుందా?
ఆల్రెడీ తెలంగాణలో తెలుగుదేశం తరఫున కాసాని జ్ఞానేశ్వర్ ద్వారా సన్నాహాలు కూడా చేసుకున్నారని అయితే చంద్రబాబు ఆకస్మిక అరెస్టుతో ఈ ప్రణాళికలన్నీ మారిపోయాయని తెలుస్తుంది. అయితే ఇప్పుడు విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పినటువంటి జనసేన ఇప్పుడు తెలంగాణలో ఒంటరిగా నైనా సరే పోటీ చేస్తానని అంటుందట. అసలు మొన్నటి వరకు అయితే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఇద్దరూ తమ పొత్తు ప్రయాణం అనేది తెలంగాణ ఎన్నికలతోనే మొదలు పెడదామని అనుకున్నారు.
అయితే చంద్రబాబు అరెస్టుతో వీళ్ళ ఆలోచన తలకిందులు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయనపై సింపతి విపరీతంగా పెరిగిందని అంటున్నారు. ఈ సింపతి అనేది ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం అని అంటున్నారు. అలాగే తెలంగాణలో జనసేన పార్టీకి కూడా మంచి గ్రిప్ ఉందని వాళ్ళ పార్టీ వాళ్లు అంటున్నారు. దాంతో వాళ్లు కూడా అక్కడ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ల ఉద్దేశం.
అయితే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనుకున్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దానికి బదులు జనసేన పోటీ చేయబోతుందేమో అని అనుకుంటున్నారు . ఒకవేళ వాళ్ళు పరస్పరం అవగాహనతో గనుక పోటీ చేసి గెలిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా పడుతుందని అంటున్నారు. వాళ్లు అక్కడ 10సీట్లు గెలిచినా అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బే అని అంటున్నారు వాళ్లు.