జీ20 సమావేశాల్లో సత్తా చాటిన ఇండియా?

ఆసియాలో 1997వ సంవత్సరంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం  తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా బలమైన దేశాలన్నీ కలిసి గ్రూపుగా మారాయి. అదే జీ20 సదస్సు. జీ20  సభ్యత్వ దేశాలుగా ఉన్న దేశాలు 20 అవి.. ఇండియా, అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, మెక్సికో, దక్షిణ కొరియా, రష్యా, టర్కీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్ డమ్,  యూరోపియన్ యూనియన్.


అయితే ఈ జీ20 సభ్యత్వ దేశాలలో పాకిస్తాన్ లేదు. 2008 నుంచి స్పెయిన్ శాశ్వత ఆహ్వానిత దేశంగా ఉంది అని తెలుస్తుంది. 2019 నుండి స్పెయిన్, నెదర్లాండ్స్, చిలీ, థాయిలాండ్, వియత్నం, సింగపూర్, ఈజిప్ట్, సెనెగల్‌లను ఆహ్వానించారు. వరల్డ్‌ బ్యాంక్‌, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో, ఐరాస, ఐఎంఎఫ్‌, ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు, డబ్ల్యూటీవో, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ లాంటి సంస్థలు కూడా ఈ సదస్సులకు హాజరు అవుతాయి.


1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20 ప్రధాన కార్యాలయం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. ఏ దేశంలో జీ20 సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకొంటుంది. అక్కడ జరిగే జీ20 సదస్సుకు ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు  గ్రూపులుగా విభజించారు. అధ్యక్ష బాధ్యతలు గ్రూపుల వారీగా ఇచ్చి ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.


అయితే జి20  సమావేశంలో మోడీ అలాగే బైడెన్ 10-12 దేశాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అలాగే చైనా సిల్క్ రోడ్డు పేరుతో చేస్తున్నటువంటి కార్యక్రమం అమెరికాకు నచ్చడం లేదని అంటున్నారు. దీనినే భారత్ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించింది. అమెరికా, సౌదీ అరేబియా, భారత్, దుబాయ్ కలిపి రైల్వే డీల్ కు సంబంధించి కీలకమైన నిర్ణయం జీ ట్వంటీ సమావేశాల్లో తీసుకున్నారు. మొత్తానికి జీ20 నిర్వహణ ద్వారా ఇండియా సత్తా చాటింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

G20

సంబంధిత వార్తలు: