దేశ విభజనతో ఇండియా ఇంత నష్టపోయిందా?
ప్రస్తుత సమాజానికి చాలామందికి తెలియదు. దేశంలో నెహ్రు, గాంధీ, ఇందిరా గాంధీ గురించి రాసిన పుస్తకాలు, పాఠ్యాంశాలు ఉన్నాయి. కానీ సర్దార్ వల్లబాయ్ పటేల్, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడో చిన్న వ్యాఖ్యానాల రూపంలో తప్పితే వారు చేసిన ఉద్యమం వారు అవలంభించిన విధానాల గురించి మాత్రం ఎక్కడా రాయలేదు. ముఖ్యంగా భగత్ సింగ్ గురించి కూడా పూర్తిగా రాసిన వాడు లేదు. చెప్పినా వారు లేదు.
రమణ గుండవరపు అనే వ్యక్తి దీనిపై ఒక పోస్టు పెట్టారు. ప్రస్తుత పాకిస్థాన్ లో హిందువులు, సిక్కులు దాదాపు రూ.1400 కోట్ల ఆస్తులు పొగొట్టుకున్నారు. 55 లక్షల ఎకరాలు మాగాణి, విద్యాసంస్థలు, దార్మిక సంస్థలు, దుకాణాలు, సామగ్రి, హాస్పిటల్స్, బ్యాంకుల్లో దాచుకున్నఆభరణాలు కూడా దోచుకెళ్లారు. అయితే ఢిల్లీ పాడుబడ్డ మసీదుల్లో తలదాచుకున్న హిందువులను ఘోరమైన చలిలోనే అక్కడ నుంచి వెళ్లగొట్టారు. అయినా గాంధీజీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
ఎందుకంటే అవి పాకిస్థాన్ కు చెందిన వారివి కావడంతోనే ఇలా చేశారని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే పాకిస్థాన్ కు 55 కోట్ల ధనాన్ని ఇవ్వాలని గాంధీజీ అమరణ నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా అనిపించిందని.. భారత ప్రభుత్వం మరో సారి చెల్లిద్దామని పటేల్ చేసిన సూచనను గాంధీ పట్టించుకోలేదని రాశారు. చివరకు డబ్బులివ్వాగానే అదే ధనంతో పాక్ ఆయుధాలు కొనుక్కుని కాశ్మీర్ లో దురాక్రమణ చేసిందని రాశారు.