రష్యాలో భారత్ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E
దాంతో అమెరికా భారత్ కు సంబంధించిన రంగు రాళ్ళు, వజ్రాల వ్యాపారం పై ఆంక్షలు పెట్టినట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా దాదాపు 215 కోట్ల రూపాయలకు సరిపడా డాలర్ల లో ఉన్న సొమ్మును సీజ్ చేసేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు అని అడిగితే మేము రష్యా తో వ్యాపారం చేయవద్దు అని ఆంక్షలు పెట్టినా మీరు చేశారు కాబట్టి ఈ విధంగా చేసుకు వచ్చాం అని చెప్తుంది అమెరికా. అమెరికా ఈ విధంగా మన బంగారు మరియు నగల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంది.
యునైటెడ్ స్టేట్స్ అధికారులు రష్యా నుండి దిగుమతులను ఆరోపిస్తూ భారతీయ వజ్రాల డీలర్లకు చెందిన ఫారమ్‌ల ద్వారా సుమారు 250 కోట్ల బదిలీలను స్తంభింపజేశారు. యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్స్ ఆఫీస్ ఫోరమ్ ఆస్తుల నియంత్రణ ఓఎఫ్ఎసి ద్వారా ఈ చర్య తీసుకున్నారు. భారతీయ వజ్రాల డీలర్లు యునైటెడ్ స్టేట్స్ ఆరోపించిన ఉల్లంఘనలను ఖండించారు.
రష్యా మాకు మిత్ర దేశం కాబట్టి మేము బంగారాలు, వజ్రాలు ఇలాంటివి కొనుక్కునే హక్కు మాకుంది. అలాంటి మా రష్యా దేశం మాపై ఎటువంటి ఆంక్షలు విధించ లేదు. అలాంటప్పుడు రష్యానే ఆంక్షలు విధించనప్పుడు, మాపై ఆంక్షలు విధించడానికి మీరెవరు అన్నట్లుగా ఇప్పుడు అమెరికాను అడుగుతుంది. కానీ అమెరికా మాత్రం మళ్లీ మేము వద్దన్నా కూడా మీరు రష్యా దగ్గర నుండి బంగారం, వజ్రాలు లాంటి విలువైన వస్తువులు కొంటున్నారు కాబట్టి మీపై మేము ఆంక్షలు విధిస్తున్నాం అంటూ చెప్పుకొస్తుంది అడ్డగోలుగా.