దిగ్రేట్‌ చంద్రబాబు తెలివితేటలు ఇవేనా..?

చంద్రబాబు మరో 100 ఏళ్ల ముందు ఆలోచిస్తారు. ఆయన లాంటి విజనరీ క్యారెక్టర్ మరొకరు ఉండరని టీడీపీ నాయకులు ఆయన అభిమానులు చెబుతుంటారు. విజన్ 2020 లో కూడా ఇలాంటిదేనని అంటుంటారు. కానీ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే చంద్రబాబు రాష్ట్రం  శ్రీలంక, వెనిజులా, జింబాబ్వేలా అయిపోతుందని విమర్శలు చేశారు. కానీ ఇదే చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లోకి వెళుతూ జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు.

మరి ఇది ప్రజల్ని మోసం చేయడమే కదా అని వైసీపీ నాయకులు, రాజకీయ మేధావులు విమర్శిస్తున్నారు. అమ్మ ఒడి లాంటి పథకాన్ని రెండు ప్రవేశ పెట్టిన జగన్ ఒకరికే డబ్బులు ఇస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వారు ఉన్నా వారందరీకి ఇస్తానని హామీ ఇస్తున్నారు.

300 యూనిట్లే కరెంట్ ఉచితంగా ఎలా ఇస్తారని జగన్ పై మండిపడిన చంద్రబాబు మరి 1000 యూనిట్లు ఉచితంగా ఇస్తారా అని అడుగుతున్నారు. ఒక రైతుకు సంపూర్ణంగా రుణ మాఫీ చేయలేని చంద్రబాబు, ఒక డ్వాక్రా మహిళకు వంద శాతం రుణాలను మాఫీ చేయాలని చంద్రబాబు ఇలాంటి హామీలు అమలు చేయడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు.

75 శాతం అటెండెన్స్ రిస్టిక్షన్ పెట్టడం ఏంటీ అని బాబు మాట్లాడటం ఏంటని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అటెండెన్స్ రిస్టిక్షన్ పెడితే వచ్చే నష్టమేమిటి. కేవలం వారిని రెచ్చగొట్టి వారి ఓట్లను పొందెందుకు చేస్తున్న ప్రయత్నం అని అర్థమవుతుంది. చంద్రబాబు వస్తే అటెండెన్స్ తీసేస్తారా? 1000 యూనిట్లు కరెంట్ వాడే వారికి ఉచిత పథకాలు అమలు చేస్తారా? రైతు రుణ మాఫీ అమలుపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు. డ్వాక్రా రుణాల మహిళలకు ఎలాంటి హామీలు ఇస్తారు. ఇచ్చిన హామీలు తీర్చడానికి ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూర్చుకుంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: