రూ.2 వేల నోటు ట్రబుల్స్.. ఫలితం ఉంటుందా?

ప్రభుత్వం త్వరలో 2000నోట్లను ఉపసంహరించుకుంటున్నాం అన్నట్లుగా ప్రకటించింది. దానికి ఈ సెప్టెంబర్ నెల వరకు గడువు కూడా ఇచ్చింది అయితే ఈ 2000 నోట్లను రద్దు చేయడం వల్ల ఏమిటి ఉపయోగం, ఎందుకు 2000 నోట్లను రద్దు చేస్తున్నారంటే, ఒక ముక్కలో చెప్పాలంటే బ్లాక్ మనీని అరికట్టడానికి అన్నట్టు తెలుస్తుంది. గతంలో రాజీవ్ గాంధీ టైంలో గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పేరుతో బ్లాక్ మనీని అరికట్టడానికి ఒక ప్రయత్నం జరిగిందట.

అప్పుడు వాళ్ల దగ్గర ఉన్న లక్షల కోట్ల బ్లాక్ మనీలో 30 వేల కోట్లు 20వేల కోట్లు మాత్రమే జమ చేశారని తెలుస్తుంది. ఒకవేళ తమ దగ్గర ఉన్నదంతా లెక్క చెప్తే దానికి సంబంధించిన పన్నులు కట్టాలి. దానికి అనుగుణంగా అధికారులకు లంచాలు ఇవ్వాలి అని ఆలోచించి అప్పుడు ఆ విధంగా చేశారట బడాబాబులు. అయితే ఆ తర్వాత దశలవారీగా బ్లాక్ మనీని తెప్పించే క్రమంలో ఇలా నోట్ల రద్దును చేపడుతున్నట్లుగా తెలుస్తుంది.

గతంలో 500 నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు అన్న టైంలో 2016లో వందకి 70 శాతం నుండి 80 శాతం మంది తమ లెక్కను ప్రభుత్వానికి అప్పజెప్పారు. అప్పుడు దాదాపుగా ప్రింట్ అయిన ప్రతి రూపాయి తిరిగి ప్రభుత్వానికి వచ్చేసింది. ఎక్కడ ఎంతైతే సొమ్ము మంది దగ్గర ఉందో అంతా సొమ్ము కూడా 99%వరకు ప్రభుత్వానికి వచ్చేసిందని తెలుస్తుంది అప్పుడు. ఒక్క పర్సెంట్ మాత్రమే ప్రభుత్వానికి జమ కాలేదని తెలుస్తుంది.

ఆ ఒక్క పర్సెంట్ ఉన్న బడా బాబులు అందరూ ఆ బ్లాక్ మనీని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. అదేంటంటే రెండు లక్షల 50వేలు వరకు బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మేము పట్టించుకోమని, అంతకుమించి ఉంటే మాత్రం జమ చేయాలన్నట్లుగా చెప్పారట. దాంతో వాళ్లు తమకు తెలిసిన వాళ్ళందరి అకౌంట్లోను ఆ సొమ్మును అంతా విడివిడిగా జమ చేసేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: