రూ. 35 వేల కోట్లు.. బ్యాంకుల్లో వదిలేశారట?
అయితే ఈ డిపాజిట్ల వారసులను కనుక్కోవాలని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. బ్యాంకు ఆఫ్ బరోడా రూ. 3904 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2557 కోట్ల రూపాయాలు క్లైయిమ్ చేయనివి ఉన్నాయి. అయితే ఇలా క్లైయిమ్ చేయకుండా ఉన్న అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం రూ. 35112 కోట్లుగా ఉన్నట్లు తేలింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ డిపాజిట్ చేసిన వ్యక్తి ప్రస్తుతం లేకుండా పోతే వచ్చే సమస్యే పెద్దదిగా ఉండబోతుంది.
మేం అంటే మేం వారసులం అని గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. నామినీ పేర్లు రాసిన వారికి సాధారణంగా చెల్లుతుంది. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురు, పిల్లలు ఉంటే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దలు చాలా మంది పిల్లలకు తెలియకుండా గతంలో భూములు, ఇండ్లు, ప్లాట్లు కొనే వారు. కానీ వారు అర్థంతరంగా చనిపోతే ఆ భూములను, ప్లాట్లను వేరే వాళ్లు కబ్జా చేసేసేవారు. ఈ కబ్జా అయిన వాటి విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది.
కానీ బ్యాంకుల్లో సొమ్ము మాత్రం అస్సలు కబ్జా కాదు. లావాదేవీలు జరగని వాటిపై ఇలా ఆర్బీఐకి సమాచారం అందించి వాటిని ఏం చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఎంతైనా మంచిదే అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఆ డిపాజిట్ల విషయంలో ఎవరూ వారసులు ఎవరికి చెందనున్నాయనే విషయంలో మాత్రం వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని బ్యాంకులు ఏ విధంగా పరిష్కరిస్తాయనే వివరాలు తెలుసుకోవాలి.