కేసీఆర్‌కు ఆర్‌ఎస్పీ ప్రవీణ్‌ 15 ప్రశ్నలు.. జవాబుందా?

125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ అంశం నేపథ్యంలో ముఖ్యమంత్రికి బీఎస్‌పీ ప్రశ్నలు సంధించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేదలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్.. ఏడేళ్ల తర్వాత అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. 2016లో శంఖుస్థాపన చేసిన తర్వాత గుర్తుకు రాని అంబేద్కర్ విగ్రహం   ఆగమేఘాలపై ఆవిష్కరించబోతున్నారన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్..ఎన్నికలు వస్తున్నాయని అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నారన్నారు.

ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్.. ఎన్టీఆర్ పార్కు పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఏడేళ్లు పట్టిందన్నారు. హెలికాప్టర్ లో అంబేద్కర్ విగ్రహంపై పూలు చల్లుతామనడం విడ్డూరంగా ఉన్నా ధన్యవాదాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. 9 ఏళ్ళ పాలనలో ముఖ్యమైన ప్రశ్నలు, సందేహాలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభా వేదికగా సీఎం నివృత్తి చేయాలని.. మొత్తం 25 ప్రశ్నలు సంధించారు.

2016 ఏప్రిల్ 14న ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ భవనం కూల్చేసి 15 అంతస్తుల భవనం నిర్మిస్తామని శంఖుస్థాపన చేశారని.. ఆ శిలాఫలకం శిధిలావస్థలకు చేరిందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. అంబేద్కర్, బాబు జగజ్జీన్ రామ్, పూలే జన్మదినోత్సవాలకు ఎప్పుడూ సీఎం హాజరు కాలేదని.. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ అన్నారు.

రైతుల జీవితాలు నాశనం చేయడానికి ధరణి పోర్టల్ తెచ్చారన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే సీఎం పీఠం నుంచి‌ కేసీఆర్ దిగిపోవాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. మరి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంధించిన 25 ప్రశ్నలకు బీఆర్‌ఎస్‌ నుంచి సమాధానం వస్తుందా లేదా అన్నది తేలాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RSP

సంబంధిత వార్తలు: