రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

అమెరికా యూరప్ దేశాలు ఎవరికీ కొత్త ఆయుధాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలు ఇప్పటికే ఇచ్చారు తయారైనవి తయారైనట్టిస్తున్నారు. ఏరోజుకారోజు ఆయుధాలు అయిపోతున్నాయి ఉక్రెయిన్ దగ్గర. ఆయుధాలు లేకనే బాగ్పుత్ లో ఓడిపోయారు. మిగతా ప్రాంతాన్ని కూడా లాక్కునేటువంటి పరిస్థితి .

దీంతో జెలెన్స్కి ని ముందు నువ్వు చర్చలు ప్రారంభించు ఆ రకంగా కొంత గ్యాప్ ని క్రియేట్ చెయ్ అని అమెరికా చెప్తుంటే నన్ను లొంగిపొమ్మంటుంది అమెరికా అంటూ పిచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాడు జెలెన్స్కి. చర్చలు ప్రారంభించి తాత్కాలిక కాల్పుల విరమణ  కానీ చేస్తే మేము పెద్ద ఎత్తున ఆయుధాలు తయారు చేసి ఇస్తామని వీళ్లు చెప్తున్నారు. అది జరిగిందంటే నా దేశంలోని ప్రాంతాలను వాళ్లకు వదిలేసినట్టు అవుతుందని, అలా జరిగితే నా దేశం లోని ప్రజలు నన్ను వెళ్ళగొడతారు అప్పుడు నేనేం చేయలేను అనేటువంటిది జెలెన్స్కి మెంటాలిటీ. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం నడుస్తోంది.

రోడ్లన్నీ బ్లాక్‌ చేసి రష్యాపై ఎదురుదాడికి దిగాలని ఉక్రెయిన్ ప్లాన్ చేసింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు తన దళాలు ఇంకా ఎదురుదాడిని ప్రారంభించలేదని అంగీకరించారు.  ప్రెసిడెంట్ జెలెన్స్కి జపనీస్ వార్తా పత్రిక లుమినికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉక్రెయిన్ సైన్యానికి ఆయుధాలు లేవని మరియు అవి లేకుండా ఎటువంటి దాడిని ప్రారంభించలేమని చెప్పారు.

మొన్ననే మేము పోగొట్టుకున్నటువంటి భాగాలన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటాం. పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకుని తిరిగి దాడి చేస్తాం. రష్యా కు దిమ్మతిరిగే విధంగా  యుద్ధం చేసి దానికి బుద్ధి చెప్తాం అంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అమెరికా యూరప్ దేశాల యొక్క సహాయం తీసుకుంటున్నా జెలెన్స్కి మాత్రం తన సొంత ఆలోచనతో తన దేశాన్ని తన ప్రజలను ఎలా కాపాడుకోవాలి అనే విషయం మీద ఒక క్లారిటీతోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే జెలెన్స్కి ఆ విధంగా ఆలోచించడం అమెరికా యూరప్ దేశాలకు ఒకరకంగా నచ్చడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: