యుద్ధరంగంలోకి పోలండ్.. ఇక వరల్డ్ వార్ తప్పదా?
అమెరికా, నాటో దేశాలు కలిపి ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడంతో ఇంత వరకు యుద్దం కొనసాగుతుంది. లేకపోతే ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. అలాంటిది ఇప్పుడు పోలండ్ దూకుడుగా మాట్లాడుతుంది. ఉక్రెయిన్ లోని రష్యా అనుకున్న నాలుగు ప్రాంతాలు అది స్వాధీనం చేసేసుకుంటే తర్వాత మాపైనే పడతారు. కాబట్టి ముందుగానే రష్యాపై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
కానీ పోలండ్ నాటో దేశాల్లో సభ్యత్వం కలిగిన దేశం. అది యుద్ధం చేస్తే నాటో దేశాలు అన్ని యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అమెరికా కూడా కచ్చితంగా చేస్తుంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టే. అమెరికా, నాటో దేశాల వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి. రష్యా వద్ద కూడా అణు బాంబులు ఉన్నాయి. పోలండ్ గనక యుద్ధ రంగంలోకి దిగితే వచ్చేది మూడో ప్రపంచ యుద్ధమే.
పోలండ్ తెలిసి తెలియక మాట్లాడుతుందో కానీ, జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని గ్రహించాలి. దీనిపైనే రష్యాలోని పోలండ్ రాయబార కార్యాలయంలో ఈ మాటలు అన్న తర్వాత రష్యా సిద్ధమని చెప్పేసింది. దీంతో మేం యుద్ధం చేయాలనుకోవడం లేదు. కేవలం మా భూభాగాల్లోకి వస్తేనే చేస్తామని చెప్పింది. యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ ఎంతో నష్టపోయింది. ఆయా ప్రాంతాల్లో మళ్లీ పాత రోజులు రావాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పోలండ్ ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. ఉక్రెయిన్ లాంటి పరిస్థితి ఎదురు కాక తప్పదు.