పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రాశి కన్నా , శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే చాలా కాలం క్రితం ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి తేరి మూవీ కి రీమేక్ అని ఓ వార్త వైరల్ అయింది.
ఈ వార్త వైరల్ అవడంతో చాలా మంది తెరి సినిమా ఇప్పటికే తెలుగులో పోలీసోడు అనే టైటిల్ తో విడుదల అయింది. తెలుగులో ఇప్పటికే విడుదల ఆయిన ఈ సినిమాను మళ్ళీ రీమేక్ చేస్తే ఆ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే వార్తలు వైరల్ అయ్యాయి. దానితో చాలా మంది ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమా తేరి మూవీ కి రీమేక్ అని వార్తలు వైరల్ కావడంతో చాలా మంది ఈ సినిమాకి పెద్దగా క్రేజ్ ఉండదు.
ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ వచ్చిన పెద్దగా అది జనాలను ఇంపాక్ట్ చేయదు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఈ మూవీ నుండి దేక్లైంగే సాలె అనే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి తెచ్చుకుంది. ఈ సాంగ్ కి విడుదల 24 గంటల్లో 28.53 మిలియన్ వ్యూస్ ... 502.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ సాంగ్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.