చికెన్ తిన్న తర్వాత తినకూడని ఆహారాలు ఇవే.. ఈ విషయాలు గురుంచుకోండి!

Reddy P Rajasekhar

చికెన్ ప్రియులు మనలో చాలా మంది ఉంటారు. రుచిగా ఉందని లాగించేస్తాం కానీ, చికెన్ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. సరైన ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణక్రియ మందగించడమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చికెన్ తిన్న వెంటనే పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. చికెన్ ఉష్ణ గుణాన్ని కలిగి ఉంటే, పాలు చలవ చేస్తాయి. ఈ విరుద్ధ ఆహారాల వల్ల శరీరంలో రియాక్షన్ జరిగి తెల్ల మచ్చలు (Vitiligo) వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆయుర్వేదం చెబుతోంది.

అలాగే చికెన్ తిన్న తర్వాత పెరుగు కూడా తినకూడదని కొందరు అంటుంటారు. చికెన్ శరీరంలో వేడిని పెంచుతుంది, పెరుగు శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ రెండు వేర్వేరు ప్రభావాలు ఉన్న ఆహారాలను కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడి గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపల విషయానికి వస్తే, చికెన్ మరియు చేపలు రెండూ అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలే. అయితే వీటిని ఒకేసారి లేదా వెనువెంటనే తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడం భారమవుతుంది. ఇది అలర్జీలకు కూడా దారి తీయవచ్చు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చికెన్ తిన్న తర్వాత పండ్లు తీసుకోవడం కూడా మంచిది కాదు. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి, కానీ మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపులో ఆహారం పులిసిపోయి అజీర్తి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిమ్మరసం పిండిన చికెన్ తిన్న తర్వాత పాలు తాగడం అత్యంత ప్రమాదకరం. ఇక నువ్వులతో చేసిన పదార్థాలను కూడా చికెన్ తిన్న తర్వాత తీసుకోకపోవడమే శ్రేయస్కరం. ఈ నియమాలను పాటించడం ద్వారా కేవలం రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడమే కాకుండా, మీ ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: