అందరు అనుకున్నంత పని చేస్తున్న పూజ హెగ్డే .. కుల్లుకుంటున్న మిగతా హీరోయిన్స్..!
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు పూజా హెగ్డే మరియు రోహన్ మెహ్రా కలిసి ఏ సినిమా చేయలేదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని సమాచారం. ఆ పరిచయం క్రమంగా బలపడుతూ ప్రేమగా మారి, భవిష్యత్తులో పెళ్లి వరకు వెళ్లే అవకాశముందనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటి వరకు పూజా హెగ్డే గానీ, రోహన్ మెహ్రా గానీ అధికారికంగా స్పందించలేదు. అందువల్ల ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ టాపిక్ హాట్‌గా మారింది.
ఇక పూజా హెగ్డే తన కెరీర్‌లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, తన స్థానం మాత్రం దృఢంగా నిలబెట్టుకుంటోంది. ఆమె అందం, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా అవకాశాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇలానే చర్చనీయాంశంగా మారడం సహజమే.కొంతమంది అభిమానులు ఈ వార్తలను ఆసక్తిగా చూస్తుండగా, మరికొందరు మాత్రం ఈ విషయంపై వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పూజా హెగ్డే పేరు మళ్లీ ఒకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. చూడాలి మరి దీని పై పూజా హెగ్డే ఎలా స్పందిస్తుందో..???