హమ్మయ్య..ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ వచ్చేస్తుందోచ్..!
ప్రత్యేకంగా ఈ సినిమాలో ఉండబోయే వార్ ఎపిసోడ్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్శకుడు హను రాఘవపూడి యుద్ధ సన్నివేశాలను ఎంతో గ్రాండ్‌గా, రియలిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నారని చెర్రీ వెల్లడించారు. ఈ యుద్ధ సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తాయని, ప్రేక్షకులకు ఒక గొప్ప విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభాస్‌ను ఇంత శక్తివంతమైన వార్ బ్యాక్‌డ్రాప్‌లో చూడటం అభిమానులకు కొత్త అనుభూతిని అందించనుంది.ఇంకా, ఈ చిత్రంలో హీరోయిన్గా కొత్త ముఖం ఇమ్మాన్వీ పరిచయం కానుంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైన మలుపులు తీసుకురానుందని సమాచారం. ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ ఎన్నో సినిమాల్లో నటిస్తున్నా.. ‘ఫౌజీ’ పై అభిమానులు మరింత భారీ అంచనాలు పెట్టుకోవడం గమనార్హం. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, పీరియాడిక్ ఎలిమెంట్స్ కలిసిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది చివర్లో ప్రభాస్‌ను పవర్ఫుల్ అవతారంలో, భారీ యుద్ధ సన్నివేశాల మధ్య చూడటానికి అభిమానులు సిద్ధంగా ఉండొచ్చు. ‘ఫౌజీ’ సినిమా టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా సంచలనం సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.