రష్యాకు ఊహించని ఝలక్‌ ఇచ్చిన ఉక్రెయిన్‌?

రష్యా, ఉక్రెయిన్ యుద్దం దాదాపు ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దంలో ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జెపొజజరియా, కేరసన్, డొనెట్స్కీ లాంటి ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగుతోంది. ఇన్ని రోజులు ఆత్మరక్షణకే ప్రాధాన్యం ఇచ్చిన ఉక్రెయిన్ రష్యాలోని కొన్ని ప్రాంతాలపై దాడులకు సిద్ధపడుతోంది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతం బల్గర్ లో ఇలాంటి దాడులనే ఉక్రెయిన్ చేసింది.

దీని వల్ల రష్యాలోని ఒక మహిళకు గాయాలు కావడం, అక్కడ ఉండే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. యుద్ధం మొదలైన మొదటి సారి రష్యాకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఉక్రెయిన్ కు జర్మనీ ఇచ్చిన రెండు మిస్సైల్స్ దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా ఛేధించగలవు. అలాంటి మిస్సైల్ తోనే ఇప్పుడు రష్యాలోని బల్గర్ పట్టణంపై దాడి చేసింది. ఈ పట్టణం ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని వల్ల కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి.

కొన్ని శకలాలు ఇళ్లపై పడ్డాయి. మరి ఉక్రెయిన్ దాడిని రష్యా ఏ విధంగా చూస్తుంది. ఈ దాడి వల్ల యుద్దం పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. పుతిన్ దాడులను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా నిఘా సంస్థ హెచ్చరించిన ప్రకారం.. అణ్వస్త్ర దాడికి రష్యా సిద్ధమవుతుందని తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాలోని సిటీపై ఉక్రెయిన్ దాడికి పాల్పడటం నిప్పుతో చెలగాటమాడటమే. మునుముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు. అణు యుద్ధం జరిగితే ఉక్రెయిన్ తో పాటు చుట్టు పక్కలా ఉన్న యూరప్ దేశాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడక తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: