జగన్ పీకుడు భాష.. అసలు రహస్యం ఇదేనా?
తాజాగా జగన్ చేస్తున్న పీకుడు వ్యాఖ్యల గురించి విశ్లేషిస్తూ.. ఆయన సంయమనం కోల్పోతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని.. ఆ విషయం తెలిసిపోయింది కనుకనే ఆయన అంత టెన్షన్ పడుతున్నారని వారు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్ మొదటి నుంచి మాటలపై అదుపు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఆయన దాదాపు పదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ మరీ ఇంత హార్ష్‌గా మాట్లాడింది తక్కువ. అంటే ఆయన్ను ఎంత టెన్షన్ పెట్టినా మాటలపై అదుపు కోల్పోవడం చాలా అరుదు.
జగన్ రాజకీయ చరిత్ర చూస్తే.. సోనియాగాంధీ తనను ఇబ్బంది పెట్టిన రోజుల్లోనూ జగన్ నోరు జారలేదు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తన ఎమ్మెల్యేలను తీసేసుకుని మంత్రి పదవులు ఇచ్చిన రోజుల్లోనూ పెద్దగా సంయమనం కోల్పోలేదు. చంద్రబాబును కాల్చి చంపాలి అంటూ ఓసారి ఆవేశ పడ్డారు. అలాంటి ఒకటి రెండు మాటలు తప్ప.. ఎక్కువగా జగన్ నోరు జారలేదు.
మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది.. దీనికి అసలు కారణం.. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కోతల పరిస్థితి అని మరికొందరు విశ్లేషిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఏపీలో విద్యుత్ కోతలు పెరిగాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ కరెంట్ సమస్యను హైలెట్ చేస్తోంది. ఆ దాడి నుంచి తప్పించేందుకే జగన్.. ఇలా హార్ష్‌గా మాట్లాడటం ద్వారా పొలిటికల్ అటెన్షన్‌ను డైవర్ట్ చేశారని చెప్పొచ్చు.