తెలుగునాట జైభీమ్ సీన్.. సత్యంబాబు చెబుతుందిదేగా?

జై భీమ్.. ఇటీవల బాగా సోషల్ మీడియాలో చర్చ జరిగిన సినిమా.. అమాయక గిరిజనులను చేయని తప్పుకు తప్పుడు కేసులో ఇరికించి.. లాకప్‌లో కొట్టి కొట్టి చంపిన దారుణ గాధ.. తన భర్త కోసం అలుపెరగని న్యాయపోరాటం చేసిన ఓ భార్య కథ.. అమాయక గిరిజనులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాడిన ఓ న్యాయవాది కథ ఇది. ఈ జై భీమ్ కథ తమిళనాడులో జరిగిన ఓ యథార్ధ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. అయితే.. ఇలాంటి దారుణగాధలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఎప్పుడో పాత కాలంలో కాదు.. సమకాలీన సమయంలోనే సత్యం బాబు గాధ జై భీమ్ తరహాలోనే సాగుతుంది.

సత్యంబాబు..  కృష్ణా జిల్లాలో ఆయేషా మీరా అనే అమ్మాయి అత్యాచారం, హత్య కేసులో నిందితుడు.  దాదాపు పదేళ్ల న్యాయపోరాటం తర్వాత సత్యం బాబు ఈ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే.. ఈ కేసు విచారణ సమయంలో సత్యంబాబును అతి దారుణంగా హింసించారట. తప్పు చేసినట్టు ఒప్పుకోమని పోలీసులు దారుణంగా కొట్టేవారట. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని సత్యం బాబు చెబుతున్నాడు.. తనపై కేసు పెట్టేటప్పటికి మంచి యువకుడుగా ఉన్న సత్యం బాబు.. ఆ తర్వాత.. ఎవరో ఒకరు నడిపిస్తే తప్ప నడవలేని స్థాయికి చేరుకున్నాడు.

ఇదంతా పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం వల్లనే అంటున్నాడు సత్యంబాబు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆయన ఇప్పుడు  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం లేఖ రాశాడు. సత్యం బాబు పాపం.. జైల్లోనే డిగ్రీ పూర్తి చేశాను. జై భీమ్‌ సినిమాలోలానే తనను కూడా కావాలనే ఈ కేసులో ఇరికించారంటున్నాడు సత్యంబాబు. అందుకే తాను నష్టపరిహారం కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నానని.. కానీ ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని సత్యంబాబు చెబుతున్నాడు. న్యాయం కోసం ఆయేషా తల్లి...  చేయని నేరానికి అన్యాయంగా శిక్ష అనుభవించిన నేను.. నిస్సహాయంగా బలైపోయామని సత్యం బాబు చెబుతున్నాడు. ఈ  దేశంలోని పోలీస్‌, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల దుస్థితికి తాము మౌన సాక్షులం అంటున్నాడు సత్యంబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: