జాతీయ పార్టీలెన్ని.. ప్రాంతీయ పార్టీలెన్ని.. ఇదిగో లిస్టు?

పార్టీ అంటే రాజకీయ పార్టీ.. అంతే కదా.. మళ్లీ అందులో జాతీయ పార్టీ ఏంటి.. ప్రాంతీయ పార్టీ ఏంటి అంటారా.. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్న పార్టీని జాతీయ  పార్టీ అంటారా.. ఏదైనా ఒకే రాష్ట్రంలో ఉంటే దాన్ని ప్రాంతీయ పార్టీ అంటారు. అయితే..టీడీపీ వంటి పార్టీలు కేవలం ఒక్క రాష్ట్రంలోనే ప్రభావం చూపినా.. అవి తమను తాము జాతీయ పార్టీ అని చెప్పుకుంటాయి. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, రాష్ట అధ్యక్షుడు అంటూ బిల్డప్ ఇస్తుంటాయి.

అయితే ఈ సీ లెక్కల ప్రకారం.. జాతీయ పార్టీలు 8 వరకూ ఉన్నాయి. అవేంటంటే.. బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ.. ఈ 8 పార్టీలు జాతీయ పార్టీలు అన్నమాట. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. ఇవి 27 వరకూ ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు ఏంటంటే.. ఆప్‌, , టీడీపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ, ఏజీపీ, ఏఐఐఏడీఎంకే, ఏఐఎఫ్‌బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్‌, బీజేడీ, సీపీఐ (ఎంఎల్‌) (ఎల్‌), డీఎండీకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్‌, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్‌ఎస్‌, ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్‌, పీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఎస్‌ఏడీ, ఎస్‌డీఎఫ్‌, శివసేన, ఎస్‌కేఎం. అదన్నమాట సంగతి.

అయితే.. ఈ ప్రాంతీయ పార్టీల్లో కొన్ని జాతీయ  పార్టీలుగా ఎదగాలని కలలు కంటున్నాయి. వాటిలో ఆప్‌, టీడీపీ వంటివి కొన్ని. ఈ దిశగా ఆప్ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. మొదట్లో దిల్లీలో సత్తా చాటిన ఈ పార్టీ.. ఆ తర్వాత పంజాబ్‌లోనూ ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక ఆ పార్టీకి త్వరలోనే జాతీయ పార్టీ హోదా వచ్చే అవకాశం ఉంది. ఆ మధ్య గుజరాత్ ఎన్నికల్లోనూ ఆప్ పార్టీకి ఓ నగరంలో చాలా కార్పొరేటర్ల సీట్లు వచ్చాయి కూడా.

ఇక టీడీపీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంటుంది కానీ.. ఆ పార్టీకి అంత సీన్ ఉన్నట్టు కనిపించదు. తెలంగాణలో ఆ పార్టీ నామ్‌కే వాస్తేగా మారిపోయింది. పేరుకు ఓ అధ్యక్షుడు, కార్యవర్గం ఉన్నా.. కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ.. ఏ ఇతర ప్రజాప్రతినిధిగానీ ఆ పార్టీ తరపున ఎన్నిక కాలేదు. దీంతో ఆ పార్టీ కేవలం ప్రాంతీయ పార్టీగానే మిగిలిపోక తప్పని పరిస్థితి. ఇదీ దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీల పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: