జగన్‌ కాదు.. బాబు కాదు.. పవన్‌ కాదు.. ఈ ఎన్నికల్లో వీళ్లే కీలకం?

Chakravarthi Kalyan
సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి వారి వ్యక్తిగత టాలెంట్ తో వ్యక్తిగత వీక్షకులపై వీరి ప్రభావం కీలకంగా ఉంటుంది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లకు మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ ప్లుయెన్సర్స్ అనే సంగతి తెలిసిందే.

విషయం ఏదైనా.. ఎంత క్లిష్లమైనది అయినా.. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వీలైనంత క్లుప్తంగా, అంతకు మించి స్పష్టంగా వీరు సమాచారం ఇస్తారు. ఫలితంగా ఇంటర్నెట్ యూజర్లు వీరికి ఇట్టే అభిమానులగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో వీరి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వాళ్లు పెట్టే వీడియోలు చాలా వరకు చర్చనీయాంశం అవుతాయి. ఇలా దాదాపు ప్రతి విషయంపైన అన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతున్న ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లయెన్సర్స్.. ఇప్పుడు రాజకీయాలపైనా ప్రభావితం చూపుతున్నారు.

ఎన్నికల సమయంలో వీరు పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయి అని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా వీరికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గతంలో పేపర్లు, టీవీలు కీలక పాత్ర పోషిస్తే.. ఈ సారి సోషల్ మీడియా ఈ ఎన్నికలను శాసించనుంది.  ఇలాంటి విషయంలో ముందుండే చంద్రబాబు ఇప్పటికే ఇన్ ఫ్లుయెన్స్ తో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఇక తాజాగా సీఎం జగన్ విశాఖ పట్నం పెద్దిపాలెంలో రాష్ట్ర నలమూలల ఇన్ ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు.  మీ ప్రభావం అసమాన్యం.. ఎల్లో మీడియా దుష్ర్పచారానికి మీరే సరైన సమాధానం. ప్రజల్లోకి వాస్తవాలు, తీసుకెళ్లాలి అంటూ వారికి పలు సూచనల చేశారు. రానున్న అతి స్వల్ప కాలంలో వీరి ముందున్న లక్ష్యాలను దిశా నిర్దేశం చేశారు. మనం విజయానికి చేరువగా ఉన్నామని.. వాళ్లు దూరంగా ఉన్నారని అందుకు మన మీద దాడి చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలతో దిగిన సెల్ఫీని  తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: