నేనేం తక్కువ అంటున్న షర్మిల.. ఆ కోరిక తీరుతుందా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తన అన్నసీఎం జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. హోదా విషయంలో గతంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోకుండా జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఇప్పటికే కేంద్రం పలుమార్లు స్పష్టం చేసినా ఇంకా అదే అంశాన్ని పట్టుకొని సాగదీస్తున్నారు.

అయితే ప్రత్యేక హోదా అధ్యాయం ముగియడానికి ప్రధాన కారణం చంద్రబాబే అనే విషయం ఆమె మరిచిపోతున్నారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీయే ముద్దు అని అంటూ కేంద్రం చెప్పిన దానికి అంగీకరించారు. హోదా కంటే ప్యాకేజీ వల్లే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే తాజాగా ఆమె మళ్లీ ప్రత్యేక హోదా అంశం, విజభన హామీల అమలుపై సీఎం జగన్ కు, చంద్రబాబు కు కలసి పోరాడుదాం అంటూ లేఖలు రాస్తున్నారు.

ప్రస్తుతం షర్మిళ సెక్యూరిటీ కోరుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   పక్కన డఫేదారు లేకపోతే కలెక్టర్ ను సైతం పట్టించుకోరు. అలాగే రాజకీయ నాయకులకి కూడా చుట్టూ ఓ పదిమంది సెక్యూరిటీ లేకపోతే రాజసంగా ఉండదు అని భావిస్తుంటారు. ఇప్పుడు దీనిని అస్త్రంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు.

ఒక మహిళ, పార్టీ అధ్యక్షురాలిని అని చూడకుండా అవమానిస్తున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మీరు సెక్యూరిటీ పెద్ద కోటలో ఉంటే సరిపోతుందా అని సీఎం  జగన్ ను నేరుగా అటాక్ చేశారు. సాధారణంగా సెక్యూరిటీ వారికి పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఇస్తారు. చంద్రబాబు నాయుడు మాజీ సీఎం అయినా గతంలో నక్సలైట్ల దాడులు జరిగాయి కాబట్టి ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగిస్తున్నారు. ఇక సీఎం రక్షణ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం పురంధేశ్వరి, ఇతర పార్టీ అధ్యక్షులకు ఏ విధమైన సెక్యూరిటీ  ఇస్తున్నారో అదే తరహా షర్మిళకు ఇస్తున్నారు. కానీ ఆమె తన అన్న సీఎం జగన్ తరహా సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: