కేసీఆర్‌, కేటీఆర్‌.. ఆ రేంజ్‌లో దోచుకున్నారా?

Chakravarthi Kalyan
గత బీఆర్‌ఎస్ సర్కారు పాలన ప్రజలను మోసం చేసి, ప్రజా సంపదను దోచుకుందని, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 50 రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించామని, ప్రతి సమీక్షా సమావేశంలో వెల్లడైన అంశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా నీటి పారుదల, పౌర సరఫరాలు, విద్యుత్, మిషన్ భగీరథ తదితర అన్ని శాఖలు భారీగా అప్పుల్లో కూరుకుపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని అక్రమాలపై విచారణ ప్రారంభించిందని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.94,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, లక్ష ఎకరాలు కూడా లేని ఆయకట్టును సృష్టించారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  పాలమూరు రంగారెడ్డికి రూ.25 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినా సాగునీరు అందలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

భద్రాద్రి యాదాద్రి పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ చేపట్టిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పేదలకు బియ్యం, సరుకులు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ ఆర్థికంగా చితికిపోయి భారీ అప్పులు చేసి వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. మిషన్ భగీరథ భారీ కుంభకోణమని రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు, నీళ్లు ఇవ్వలేకపోయారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

పైపులైన్లు వేయడం, నీటి వనరుల కల్పన, ఇతర పనుల సాకుతో హడ్కో, నాబార్డు తదితర సంస్థల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఏమీ చేయలేదని  లోక్‌సభ ఎంపీగా తాను మిషన్‌ భగీరథపై పార్లమెంట్‌లో ప్రశ్న లేవనెత్తినప్పుడు అప్పులు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: