ఇరాన్‌ విజృంభణతో కాళ్లబేరానికొచ్చిన పాకిస్థాన్?

Chakravarthi Kalyan
దాయాది దేశం పాకిస్థాన్ భయంతో వణికిపోతుంది. ఇటీవల ఇరాన్ పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ పై దాడులు చేసింది. దీనికి ప్రతిగా పాక్ కూడా ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది. దీని తర్వాత ఇరాన్ పెద్ద ఎత్తున మిలటరీ విన్యాసాలు చేయడంతో పాటు పాక్ సరిహద్దు వైపు కదులుతుందనే వార్తలు వచ్చాయి. మరోవైపు పాక్ కూడా అంతర్గతంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలతో సతమతం అవుతుంది.

అయితే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రకటనలు చేయమంటే పాకిస్థాన్ కు మించింది లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.  మన దేశంపై నేరుగా కాకుండా దొంగచాటుగా ఉగ్రవాదులను పంపించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ రాక్షాసానందం పొందడం మినహా పాక్ నేరుగా ఏ యుద్ధంలోను గెలవలేదు.  ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తుండటంతో మేం కూడా అణ్వాయుధాలు ఉపయోగిస్తాం అని.. ఆ దేశంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

ఇందులో భాగంగా ఇరాన్ కి సంబంధించిన రాయబారిని బహిష్కరించడమే కాకుండా మిస్సైల్స్ వేస్తాం అని బీరాలు పలికింది. తీరా చూస్తే ఇప్పుడు ఇరాన్ దేశానికి పాక్ విదేశాంగ శాఖ మంత్రి  వెళ్లి.. పాకిస్థాన్ కు ఇరాన్ విదేశాంగ మంత్రిని ఇక్కడికి రప్పించి చర్చలు జరుపుతామని ప్రకటించింది.

మూడు రోజుల  పాటు యుద్ధం చేయకుండానే ఇరాన్ వద్ద పాక్ మోకరించుకు కూర్చొంది. వెనక్కి రప్పించుకున్న తమ రాయబారులను మళ్లీ ఆయా రాజధానులకు పంపించాలని నిర్ణయించుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.  ఈ నెల 26 నాటికల్లా ఉభయ దేశాల రాయబారులు,, టెహ్రాన్, ఇస్లామాబాద్ లోని తమ కార్యాలయాలకు వెళ్తారని తెలిపింది. పాక్ విదేశాంగ శాఖ ఆహ్వానంపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఈ నెల 29న ఇస్లామాబాద్ ను సందర్శించనున్నారు. చైనా మధ్యవర్తిత్వం కూడా పాక్, ఇరాన్ లను మళ్లీ దగ్గర చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: