ఇండియా భద్రతకు పెనుముప్పుగా శరణార్థులు?
స్వేచ్ఛగా తిరుగుతున్నారు. డైరెక్టుగా ఆధార్ కార్డు సంపాదించుకుని ఇండియా పౌరుడిగా చెలామణి అవుతున్నారు. ఇలాంటి వారితో దేశానికి ఎప్పటికైనా ఇబ్బందే. ముఖ్యంగా దేశంపైన దేశ భక్తి గానీ నాది ఈ దేశం అని కానీ ఉండదు. వీళ్లు ఎంతకైనా దిగజారుతారు. కాబట్టి విదేశాల నుంచి వచ్చే వారిని కచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వారికి ఇండియా ఆధార్ కార్డు రాకుండా జాగ్రత్తపడాలి. కానీ ఇక్కడ ఉండే రాజకీయ నాయకుల వల్ల చాలా మంది బంగ్లాదేశ్, మయన్మార్, జాతీయులకు ఆధార్ కార్డు ఇస్తున్నారు.
అదేమిటని పోలీసులు వెరిఫై చేస్తే అక్కడ ఉండే లోకల్ నాయకుల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని విచారణలో వెల్లడవుతుంది. గుజరాత్ లో రుబెల్ అనే వ్యక్తికి ఆధార్ కార్డు ఉంది. అయితే ఇతడికి ఉత్తరప్రదేశ్ లో జంషెడ్ ప్లేస్ లో బర్త్ డే సర్టిఫికేట్ కూడా ఉంది. జంషెడ్ అలం అనే వ్యక్తి గుజరాత్ రుబెల్ కు చెందిన బర్త్ డే సర్టిఫికెట్ పోలీసులకు చూపించాడు.
అయితే దీనిపై విచారణ ప్రారంభించిన గుజరాత్ పోలీసులకు అది ఉత్తరప్రదేశ్ ది కాదని నకిలీదని తేల్చారు. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలోనే నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసుకుని ఎంచక్కా ఆధార్ కార్డుతో ఇండియా పౌరసత్వం తీసుకుంటున్నారంటే ఎంత ఈజీ అయిపోయింది. ఇలాంటి నకిలీ గాళ్లను ఏరివేయాలి లేకపోతే రానున్న భవిష్యత్తు దేశ భద్రతకు చాలా ప్రమాదం.