హెరాల్డ్ డిబేట్‌: క‌రోనా శ‌వాలు.. జ‌గ‌న్ ఆగ్ర‌హాలు.. మారేదెవ‌రు?

R Bhanu

అక్క‌డెక్క‌డో జ‌ర‌గ‌రాని ఘోరం.. నేరం ఏదైనా జ‌రిగితే.. `అయ్య‌య్యో.. వాళ్లూ ఒక మ‌నుషులేనా?! చీమూ నెత్తురు లేదా? మ‌న‌సులు గ‌డ్డ‌క‌ట్టాయా?`- అని నెత్తీనోరూ బాదుకుంటాం. వాట్సాపుల్లో కామెంట్లు కుమ్మ‌రిం చి క‌ళ్లు తుడుచుకుంటాం. బావురు మంటూ.. బుగ్గ‌లు నొక్కుకుంటాం. కానీ, అదే ఘోరం, అన్యాయం, అ లాంటిదే అమానుషం.. మ‌న క‌ళ్ల ముందే చోటుచేసుకుంటే..  మ‌న గుమ్మంముందే జ‌రుగుతుంటే.. మా త్రం మౌనం పాటిస్తున్నాం.. మ‌న‌కెందుకులే అని తులుపులు వేసేసుకుంటున్నాం. మ‌రి.. ఇప్పుడు మ‌న ‌లో మ‌నిషిలేడా?  మాన‌వ‌త్వం లేదా?! అనే ప్ర‌శ్న‌లు త‌ల‌పున‌కు వ‌స్తే.. తుడిచేసుకుని.. మ‌న ప‌నిలోమ‌నం మునిగిపోతున్నాం. ఇదీ.. ఇప్పుడు మ‌నిషిని.. మ‌నిషిగా చూడ‌లేని ప‌రిస్థితి.. మాన‌వ‌త్వ‌మా.. నువ్వెక్క‌డ‌? అని ప్ర‌శ్నించుకునే దుస్థితి!!

 
ప్ర‌స్తుత క‌రోనా కాలంలో మ‌నిషి విలువ ప‌డిపోయింది.. మాన‌వ‌త్వం మ‌చ్చుకు కూడా క‌నిపించ‌ని దుస్థితి రాజ్య‌మేలుతోంది. రాష్ట్రంలో జ‌రిగిన మూడు ఘ‌ట‌న‌లు.. అస‌లు మ‌నం మ‌నుషుల‌మేనా? అని ప్ర‌శ్నించు కునే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చాయి. ఎవ‌రైనా చ‌నిపోతే.. `అయ్యో..` అనే జాలి, ద‌య‌.. నేడు ఎక్క‌డా క‌నిపిం చడం లేదు. `అమ్మో.. అయ్యో..` అనే భ‌యోత్పాత చిహ్నాలే గోచ‌రిస్తున్నాయి. వ‌రుస‌గా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌ల వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. జ‌రిగిన అంశాలు ఇక‌పై అయినా.. పున‌రావృతం కాకుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వాస్త‌వం. ఏదైనా జ‌రిగిన త‌ర్వాత తీరిగ్గా క‌మిటీలు వేయ‌డం, విచార‌ణ‌ల‌కు ఆదేశించ‌డం ప‌రిపాటిగా మారిందే త‌ప్ప‌.. అలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాల‌న్న క‌నీస జ్ఞానం అధికారుల్లోనూ కొర‌వ‌డింద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 


చ‌నిపోయిన వారిప‌ట్ల క‌నీస ద‌య కూడా చూపించ‌ని పరిస్థితి మొన్నామ‌ధ్య క‌ర్ణాట‌క రాష్ట్రం బ‌ళ్లారిలో చోటు చేసుకుంది. అక్కడ ఎనిమిది మృత‌దేహాల‌ను(క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన‌వారు) ఒకే గోతిలో.. బుల్‌డోజ‌ర్‌ను వినియోగించి పాతిపెట్టారు! దీంతో ఈ విష‌యంపై దేశం మొత్తం క‌న్నీరు కార్చింది. అయ్య ‌య్యో.. అని మ‌న‌వాళ్లు కూడా బుగ్గ‌లు నొక్కుకున్నారు. కానీ, ప‌ట్టుమ‌ని ప‌దిహేను రోజులు తిర‌గ‌లేదు.. మ‌న ద‌గ్గ‌ర వ‌రుస పెట్టి ఇవే ఘ‌ట‌న‌లు మూడు జ‌రిగిపోయాయి. అయితే, ఆ ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బావురుమంటున్నారే.. త‌ప్ప త‌ర్వాత మార్పులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. 

 

నెల్లూరులో: నెల్లూరులో కరోనాకు చికిత్స పొందుతున్న ముగ్గురు గురువారం మరణించారు.  అధికారులు వారికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహాప్రస్తానం వాహనంలో ఆ మృతదేహాలను స్థానిక‌ పెన్నానది వంతెన కిందకు చేర్చారు. నలుగురు సిబ్బంది కిందకు దిగి అక్కడికి వచ్చిన జేసీబీ తొట్టెలోకి ఆ మృతదేహాలను పడేశారు. వాటిని జేసీబీతో కొంతదూరం తీసుకెళ్లి ముందే తవ్వి ఉంచిన గోతిలో పడేసి పూడ్చి పెట్టేశారు. ఈ తతంగాన్నంతా అటుగా వెళ్తున్న ఓ యువకుడు  వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయ్యింది.


తిరుప‌తిలో:  చిత్తూరు {{RelevantDataTitle}}