టి20 లలో.. ఆర్సిబి కెప్టెన్ అరుదైన రికార్డ్?

praveen
2024 ఐపీఎల్ సీజన్లో చెత్త ప్రదర్శనలు చేస్తూ వరుసగా ఓటములతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత మరో విజయం లభించింది. ఇప్పుడు వరకు 10 మ్యాచ్లు ఆడి కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఇక అట్టడుగున కొనసాగిన ఆర్సిబి జట్టు ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం నాలుగు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఈ విజయం ద్వారా అటు పాయింట్ల పట్టికలో తమ స్థానానికి కూడా మెరుగుపరుచుకుంది అని చెప్పాలి.

 అట్టడుగు స్థానం నుంచి ఒకసారిగా ఏడో స్థానానికి వచ్చి చేరింది. అయితే ఇలా చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆర్సిబి ఒక సాలిడ్ విజయాన్ని సాధించడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక రానున్న మ్యాచ్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు చేస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్ లోకి వెళ్లేందుకు అవకాశాలు కొంచెం మెరుగుపడే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను 147 పరుగులకే కట్టడి చేసిన ఆర్సిబి ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అదరగొట్టింది. మరీ ముఖ్యంగా కెప్టెన్ డూప్లెసిస్ ఇక మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు.

 ఈ క్రమంలోనే ఆర్సిబి తరఫున రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అదే సమయంలో డూప్లెసిస్ టి20 ఫార్మాట్లో ఒక అరుదైన ఘనత కూడా సాధించాడు. పొట్టి ఫార్మాట్లో పదివేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న 14వ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో అగ్రస్థానంలో క్రిస్ గేల్ 14,562 పరుగులతో టాప్ లో ఉన్నాడు. తర్వాత షోయబ్ మాలిక్ 13600, కీరన్ పొలార్డ్ 12900 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి. అయితే rcb విజయంతో అభిమానులు అందరిలో కూడా జోష్ నిండింది. తర్వాత మ్యాచ్లలో కూడా  ఇలాగే రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: