ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "మంజుమ్మల్ బాయ్స్"..!

MADDIBOINA AJAY KUMAR
కొంత కాలం క్రితం మొదట మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఒకటి. ఈ మూవీ మొదట కేవలం మలయాళం భాషలో మాత్రమే విడుదల అయ్యి అక్కడ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి ఏకంగా మాలివుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా వసూలు చేయని స్థాయి కలెక్షన్ లను వసూలు చేసి ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఇలా ఈ సినిమా అద్భుతమైన కలక్షన్ లను వసూలు చేస్తూ ఉండడంతో ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీ హిట్ అయ్యి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.
 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసులు చేసి ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అనగా మే 5 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళం , తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా కూడా ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: