ఏపీ: బీజేపీ కాండిడేట్ సీఎం రమేష్ పై దాడి.. కేంద్రం యాక్షన్ తీసుకుంటుందా..?

Divya
అనకాపల్లి జిల్లాలో గడచిన కొన్ని గంటల క్రితం రాజకీయం మరింత ఉద్రిక్తతను నెలకొంది. డిప్యూటీ సీఎం బూడిముత్యాల నాయుడు స్వగ్రామం తారువలో నిన్నటి రోజున బిజెపి వర్సెస్ వైసీపీ రాజకీయం చాలా హట్ టాపిక్ గా మారుతోంది. బిజెపి వైసిపి శ్రేణుల మధ్య ఉధృతత మరింత తలెత్తడంతో అటు బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను పోలీసుల సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే స్టేషను తరలిస్తున్న సమయంలో పోలీసు వాహనం సీఎం రమేష్ కాన్వాయ్ మీద దాడి జరగడం జరిగిందట.ఈ ఘటనలో సీఎం రమేష్ కు కూడా స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే అనకాపల్లిలోని పలు గ్రామాలను బిజెపి నేతలు అభ్యర్థులు సైతం డ్రోన్ల ద్వారా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఆ డ్రోన్లకు బిజెపి జెండాలను కట్టి ప్రచారం చేస్తున్న సమయంలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గానికి చెందిన వైసిపి అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామం తారువలో కూడా ఈ డ్రోన్లు ఎగరేశారు. అయితే తన ఇంటి మీదకు కూడా ఇవి రావడంతో ముత్యాల నాయుడు అనుచరులు బిజెపి కార్యకర్తలను  ప్రశ్నించారు. అలా ప్రశ్నించడంతో  బిజెపి నేతలు ముత్యాల నాయుడు బావమర్ది గంగాధర్ పైన కూడా దాడి చేయడంతో దేవరాపల్లి  పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్.. కూటమినేతలను పరామర్శించేందుకు వెళ్లగా బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టినట్లుగా బూడి ముత్యాల నాయుడు.. వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ వైసిపి దాడిలో నలుగురు కూటమి కార్యకర్తలకు కూడా తీవ్రమైన గాయాలు అన్నట్టుగా తెలుస్తోంది. బాధితులకు మద్దతుగా తారువు గ్రామానికి వెళ్లినటువంటి సీఎం రమేష్ అక్కడ కర్రాలతో వైసిపి కార్యకర్తలు సీఎం రమేష్ పైన దాడి చేసినట్లుగా సమాచారం. అలాగే  సీఎం రమేష్ చొక్కా కూడా చింపేసినట్టుగా కూడా తెలుస్తోంది వైసీపీ కార్యకర్తలు.. మరి బిజెపి ఎంపీ కాండేట్ ని ఇలా చేయడంతో ఈ విషయంలో బిజెపి నాయకులు ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: