ప్రేమ కథా చిత్రమ్ : రీ రిలీజ్ కి రెడీ అయిన బ్లాక్ బాస్టర్ మూవీ..!

Pulgam Srinivas
సుధీర్ బాబు కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ప్రేమ కథ చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మూవీ లో నందిత , సుధీర్ బాబు కి జోడిగా నటించగా ... ప్రభాకర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మారుతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. హర్రర్ , కామెడీ జోనర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. అప్పటి వరకు తెలుగు లో హారర్ కామెడీ జోనర్ మూవీ రాకపోవడం , ఈ సినిమా కూడా ప్రేక్షకులను కడుపుబ్బే నవ్వించే విధంగా ఉండడంతో పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.
 

ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు లో రి రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొన్ని సినిమాలకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు కూడా దక్కుతున్నాయి. దానితో ప్రేమ కథ చిత్రం మూవీ ని కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం రీ రిలీస్ లా ట్రెండ్ జోరుగా జోరుగా కొనసాగడం , ప్రేమ కథ చిత్రం కూడా అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీ కావడంతో ఈ సినిమా రీ రిలీస్ అయితే భారీ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని తెలుగు సినీ ప్రేమికులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sb

సంబంధిత వార్తలు: