"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" కి బుక్ మై షో లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో నేహా శెట్టి , విశ్వక్ కి జోడీగా నటించగా ... అంజలి ఈ మూవీ లో  ఓ కీలకమైన పాత్రలో నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ నిన్న అనగా మేము 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది.

ఇకపోతే మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను మొదటి రోజు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో ఫుల్ గా అమ్ముడుపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్ లు ఇప్పటి వరకు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.
మే 29 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 8.43 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
మే 30 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 29.26 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
మే 31 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన 73.79 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.
మే 29 , 30 , 31 వ తేదీల్లో కలిపి ఈ సినిమాకు సంబంధించిన 111.48 కే టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: