మీరు వేసిన ఓటు ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయంటే..

Suma Kallamadi
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2024 లో మరోసారి అధికారంలోకి రాబోతుందని, మోడీ సర్కార్ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని బీజేపీ నాయకులు బల్ల గుద్ది చెబుతున్నారు. దింతో సొంతంగా బీజేపీకి 370 సీట్లతో పాటు., అలాగే ఎన్డీయే కూటమి మొత్తం 400+ స్థానాల్లో గెలుస్తుందని ‘‘ఔర్ ఏక్ బార్ 400 పార్’’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. ఇక మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని చూస్తే.. ఈ సారి తప్పకుండా తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. ముఖ్యంగా దేశ ప్రజలు రాజ్యాంగాన్ని రక్షించేందుకు, అలాగే విద్వేష రాజకీయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఓట్లేశారని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక నేడు వివిధ మీడియాలు వారి ఎగ్జిట్ పూల్స్ వివరాలను తెలిపాయి. మరి అందులో ఏ పార్టీ విజయం సాదిస్తాయో ఓ సరి చూద్దామా..
ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ లో వివిధ నేషనల్ మీడియా చానెల్స్ ఏ విధంగా ఇచ్చాయి చూస్తే..
ఆరా ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌:
వైసీపీ: 13-16
ఎన్డీఏ కూటమి: 10-12

ఆరా అసెంబ్లీ :
వైసీపీ: 94 -104
ఎన్డీఏ కూటమి: 71-81
స్మార్ట్‌ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్:
వైసీపీ: 74-90
ఎన్డీఏ కూటమి: 85-101
పార్థాదాస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్:
వైసీపీ: 110-120
ఎన్డీఏ కూటమి: 55-65
సీఎన్‌ఎన్‌ న్యూస్‌-18 ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్:
వైసీపీ: 5-8
ఎన్డీఏ కూటమి: 19-22
న్యూస్ ఎక్స్ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్:
వైసీపీ: 3
ఎన్డీఏ కూటమి: 22
ఎన్డీటీవీ ఏపీ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్:
వైసీపీ: 7
ఎన్డీఏ కూటమి: 18
ఇండియా టుడే ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్:
వైసీపీ 2-4
ఎన్డీయే కూటమి 21-23
05 ఎగ్జిట్ పోల్స్ అంచనాగా దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది.
రిపబ్లిక్ టీవీ:
ఎన్డీయే: 359
ఇండియా కూటమి: 154
ఇతరులు: 30
జన్ కీ బాత్ సర్వే:
ఎన్డీయే: 362-392
ఇండియా కూటమి: 141-161
ఇతరులు: 10-20
ఇండియా న్యూస్-D-డైనమిక్స్:
ఎన్డీయే: 371
ఇండియా కూటమి: 125
ఇతరులు: 47
రిపబ్లిక్ భారత్-మాట్రిక్స్:
ఎన్డీయే: 353-368
ఇండియా కూటమి: 118-133
ఇతరులు: 43-48
ఎన్డీ టీవీ:
ఎన్డీయే: 365
ఇండియా కూటమి: 142
ఇతరులు: 36
ఇండియా టుడే లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్:
ఎన్డీయే 361-401
ఇండియా కూటమి 131-166
ఇతరులు 8-20

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: