
హీరోయిన్స్ జీవితాలతో ఆడుకుంటున్న త్రివిక్రమ్..!!
అత్తారింటికి దారేదిలో ప్రణీత సుభాష్ పరిస్థితి కూడా సేమ్. కనీసం ఒక డ్యూయట్ ఇచ్చి ఆమెను కాపాడారు. సినిమాలో ప్రధాన హీరోయిన్ సమంతకు మాత్రమే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆదా శర్మ రోల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మరీ వ్యాంప్ క్యారెక్టర్ లా ఉంటుంది. ‘అ ఆ’ మూవీలో సెకండ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశాడు. అజ్ఞాతవాసిలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా… ఎవరికీ అంత ప్రాధాన్యత ఉండదు.అరవింద సమేత వీరరాఘవ మూవీలో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా రోల్ అయితే దారుణం. అల వైకుంఠపురంలో నటించిన నివేద థామస్ అన్యాయం అయిపోయింది. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఈ సెకండ్ హీరోయిన్స్ అందరికీ స్క్రిప్ట్ చెప్పేటప్పడు త్రివిక్రమ్ మీ పాత్ర కీలకం అని చెబుతాడు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే ఏమీ ఉండదు. అరవింద సినిమా కోసం నేను బైక్ కూడా నేర్చుకున్నాను. నా సీన్స్ మొత్తం ఎడిట్ చేసి తీసేశారని ఈషా రెబ్బా ఆవేదన చెందింది. ఇలా త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ గా నటించిన వారందరూ బలైపోతున్నారు.