అఫీషియల్ : గం గం గణేశా ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఆనంద దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఆనంద్ "పుష్పక విమానం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసింది.
 

ఇక కొన్ని రోజుల క్రితం ఈ నటుడు బేబీ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు ఈయన 4 సినిమాల్లో నటిస్తే అందులో మూడు సినిమాలు కూడా ప్రేక్షకాదరణను భారీగా పొందాయి. ఇక తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

ఈ మూవీ యొక్క ట్రైలర్ ను మే 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే చాలా విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆనంద్ హీరో గా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో ఆనంద్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad

సంబంధిత వార్తలు: