నాని ఆ మూవీలో అలా ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఛలో అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీతోనే టాలీవుడ్ లో విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మిక కి "గీత గోవిందం" సినిమాలో అవకాశం దక్కడం , ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ తన కెరియర్ లో కొన్ని సినిమాలను కూడా వదులుకుంది. అలా ఈ బ్యూటీ వదులుకున్న సినిమాలలో అంటే సుందరానికి మూవీ ఒకటి. ఈ మూవీ లో నాని హీరోగా నటించగా ... నజ్రియా హీరోయిన్ గా నటించింది.

వివేకా ఆత్రేయ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీ కథ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక హీరోయిన్ అయితే బాగుంటుంది అని ఉద్దేశంతో యూనిట్ ఈమెను సంప్రదించిందట. కథ మొత్తం విన్న ఈమె ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాను , ఈ మూవీ చేయడం ప్రస్తుతం కుదరదు అని చెప్పిందట.

దానితో వీరు నజ్రియా ను సంప్రదించడం , ఆమె ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందంట. అలా మొదట రష్మిక ను అంటే సుందరానికి మూవీ లో హీరోయిన్ గా అనుకోగా ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ ప్లేస్ లో నజ్రియా వచ్చింది. ఇకపోతే ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమా ద్వారా నజ్రియాకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో దక్కింది. గతంలో నాగార్జున , నాని ప్రధాన పాత్రలో దేవదాసు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాని కి జోడిగా రష్మిక నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: