యాక్టర్ చందు గురించి విస్తుపోయే నిజాలు చెప్పిన భార్య శిల్ప..!

Divya
గడిచిన ఆదివారం సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ ప్రమాదంలోనే నటుడు చెందు కూడా గాయాలతో బయటపడ్డారు.అయితే తన ప్రియురాలు పవిత్ర మరణించడంతో చాలా కృంగిపోయాడు చందు.. ఈ బాధతోనే ఈ రోజున ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.చందు భార్య శిల్ప సూసైడ్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. అలాగే తన భర్త గురించి పలు సంచలన విషయాలను కూడా బయటపెట్టింది శిల్ప


శిల్ప మాట్లాడుతూ.. చందు తనను నాలుగేళ్ల క్రితం నుంచి దూరంగా ఉంచారని చెందు సూసైడ్ చేసుకుంటాడని అసలు అనుకోలేదనీ అసలు తమ ఇద్దరిదీ ప్రేమ వివాహమని చాలా అన్యోన్యంగా కూడా ఉండే వాళ్లమని.. పవిత్ర ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అప్పటినుంచి మా ఇద్దరి మధ్య గ్యాప్ స్టార్ట్ అయింది అంటూ శిల్ప వెల్లడించింది.. తన పిల్లలతో మాత్రమే చందు ఎక్కువగా మాట్లాడే వారిని అయితే చందు మారుతాడు అనుకున్నాము కానీ మారలేదని తెలిపింది..  పవిత్రతో  చందు సహజీవనం చేస్తున్నడని తెలిపింది.అయితే పవిత్రకు చందు కంటే ముందు చాలామందితో రిలేషన్స్ ఉన్నాయి పవిత్ర మాయలో పడి చందు చివరికి తన జీవితాన్నే పోగొట్టుకున్నారని తెలిపింది శిల్ప.పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది.. అలాంటిప్రెషన్ లోకి వెళ్లి తను మరణించి ఉంటాడని శిల్ప తెలిపింది..తమ ఇంటికి కచ్చితంగా చందు ఎప్పటికైనా తిరిగి వస్తాడు అనుకున్నాము.. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ తెలిపింది.

తామిద్దరం స్కూల్ డేస్ నుంచే ప్రేమించుకున్నాము మూడేళ్లు వెంటపడ్డాడని తాను ఒప్పుకున్నానని ఆ తర్వాత 12 ఏళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాము.. 2015లో మా వివాహం జరిగిందని నిన్నటి రోజున ఉదయం కూడా కాల్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పానని కానీ అంతలోనే సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమని తెలిపింది... అలాగే చందు చెల్లెలు శ్రావణి కూడా మాట్లాడుతూ తన అన్న మరణం కుటుంబానికి పెద్ద షాక్ అని.. తన అన్న కూడా ధైర్యవంతుడు కానీ సూసైడ్ చేసుకుంటాడని అసలు అనుకోలేదని తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: