దూసుకొచ్చిన రైలు.. నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. చివరికి?

praveen
ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వేమార్గం కలిగిన దేశంగా కొనసాగుతున్న భారత్లో ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రైలు ద్వారా ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అతి తక్కువ ఖర్చుతో పాటు సురక్షితమైన ప్రయాణం కావడంతో ఎక్కువమంది ఇక రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో అటు కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణాలలో అధునాతనమైన సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తుంది. దీంతో సామాన్యులు మాత్రమే కాదు సంపన్నులు సైతం ఇలా రైళ్లల్లో జర్నీ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలీ.

 కాగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మునుపటితో పోల్చి చూస్తే రైల్వే స్టేషన్లు అంతేకాదు ట్రైన్ లో  అందే ఎన్నో సర్వీస్ ల విషయంలో కూడా మార్పు వచ్చింది అని చెప్పాలీ. అది సరేగాని ఇక ఇప్పుడు రైళ్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఇటీవల ఒక ఆసక్తికర ఘటన జరిగింది. సాధారణంగా లోకల్ ట్రైన్ లతో పాటు ఎక్స్ ప్రెస్ రైలు కూడా పట్టాలపై పరుగులు పెడుతున్న సమయంలో.. అది ఎక్కడ ఆగాలి ఎక్కడి నుంచి బయలుదేరాలి అనే విషయాన్ని ఇక స్టేషన్ మాస్టర్ల ద్వారా నిర్ణయించబడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. స్టేషన్ మాస్టర్లు ఊపిన జెండాను బట్టి రైలు ఆగాల లేకపోతే వెళ్లాలా అని తెలుస్తూ ఉంటుంది.

 ఒకవేళ రైలు తీసుకు వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ నిద్రపోయి ఉంటే ఇక చివరికి 100 స్పీడుతో దూసుకు వెళ్లే రైలు సైతం ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ యూపీలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఒక రైలు అరగంట పాటు నిలిచిపోయింది. పాట్నా - కోట మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్ కు చేరుకుంది. అప్పటికే స్టేషన్ మాస్టర్ నిద్రలోకి  జారుకున్నారు. ఇక ఆయనను మేలుకోల్పేందుకు లోకో పైలట్ అనేకసార్లు హారన్ కొట్టారు. దీంతో స్టేషన్ మాస్టర్ లేచి జెండాతో సిగ్నల్ ఇవ్వడానికి దాదాపు అరగంట పాటు సమయం పట్టింది అని చెప్పాలి. ఈ అంతరాయంతో అటు ప్రయాణికులు అందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: