కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ పోయిన సంవత్సరం మార్క్ ఆంటోనీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య కీలకమైన పాత్రలో నటించగా ... సునీల్ ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక రీతూ వర్మ ఈ సినిమాలో విశాల్ కి జోడిగా నటించింది. అధిక్ రవిచంద్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
మంచి అంచనాల నడుమ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సాలిడ్ కలెక్షన్ లు దక్కగా , తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు దక్కాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే థియేటర్ , "ఓ టి టి" ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.