"సలార్" జపాన్ విడుదల తేదీ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన భారీ అంచనాలు నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది.
 

ఇక ఇప్పటికే భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బుల్లి తెరపై కూడా ప్రచారం అయింది. ఇకపోతే ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ కి మొదటి సారి ప్రసారం అయినప్పుడు బుల్లి తెరపై మామూలు స్థాయి "టి ఆర్ పి" రేటింగ్ మాత్రమే లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జపాన్ లో కూడా విడుదల చేయనున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను జూలై 5 వ తేదీన జపాన్ లో విడుదల చేయనున్నట్లు ఈ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో జపాన్ లో తెలుగు మూవీ లకి కలెక్షన్ లు బాగా వస్తున్నాయి. మరి సలార్ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను జపాన్ లో వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమరన్ , శ్రేయ రెడ్డి , బాబీ సింహ ముఖ్య పాత్రలలో నటించగా ... రవి బూస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: