చిన్నప్పటినుంచి అన్నీ కష్టాలే.. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విప్రో ఎంప్లాయ్..??

praveen
పేదరికం, కష్టాలు, ఒత్తిడి వంటి కారణాలవల్ల చాలామంది డిప్రెషన్ కు గురవుతున్నారు. డిప్రెషన్ లో ఉంటే సూసైడల్ థాట్స్ అనేవి రావడం సహజం. వీటికి తోడు కుటుంబాల్లో సమస్యలు వస్తే ఇక చావే శరణ్యం అని అనుకుంటారు. క్షణికావేశంలో జీవితాలను ముగిస్తారు. కానీ ఆ సమయంలో వారి వెన్నంటే ఉండే సపోర్టు అందిస్తే ఈ థాట్స్‌ నుంచి బయటపడతారు. సొంతంగా కూడా తమను తాము ఈ కష్టకాలం నుంచి బయటపడేసుకోవచ్చు. కానీ కొందరు ఈ బాధను భరించలేక చనిపోతుంటారు.
తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా సూసైడ్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అతడి వయసు కేవలం 25 ఏళ్లే. సూసైడ్ కి పాల్పడే ముందు అతడు రాసిన ఒక లెటర్ ప్రస్తుతం బయటికి వచ్చింది. దాన్ని చదివి చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే అని, నచ్చిన చదువు చదవలేదని, నచ్చిన బట్టలు కొనుక్కోలేకపోయానని, మంచి తిండి కూడా తినలేకపోయానని అతడు లెటర్‌లో రాసుకొచ్చాడు.
"నచ్చిన జాబ్ కూడా పొందలేకపోయాను. ఫ్రెండ్స్ లేరు, ఫాదర్ లేరు. ఏ సపోర్ట్ లేకుండా ఇలా ఒక్కడినే ఒంటరిగా పోరాడలేకపోతున్నా. గుడ్ బై!" అని అతడు సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ లెటర్ చదివి అయ్యో పాపం అని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇన్నేళ్లు కష్టాలు అనుభవించి, ఒక ఉద్యోగం కూడా తెచ్చుకొని అతడు ఇప్పుడు ఏ ముచ్చట తీర్చుకోకుండా జీవితాన్ని అంతం చేసుకోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నిటికీ చావు ఒకటే మార్గం కాదని, ప్రయత్నిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుందని, ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కామెంట్లు చేస్తున్నారు.
పోలీసుల ప్రకారం, సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు. ఇంట్లో సమస్యలు ఎక్కువ కావడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంట్లోనే ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. జాబ్ చేసే సమయంలో కొల్లూరు పీఎస్ పరిధిలోని తెల్లాపూర్ (BHEL) విద్యుత్తు నగర్ లో నివసించేవాడు. అయితే ఇంట్లో సూసైడ్ చేసుకున్న తర్వాత పోలీసులు వచ్చి బాడీని కిందకి దించారు. అక్కడే లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు ఫైల్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అతడి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: