భార్య వేరు కాపురం పెట్టమంటుందని.. కోర్టుకెళ్లిన భర్త.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?

praveen
సాధారణంగా దాంపత్య బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఎన్ని కష్టసుఖాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ.. సంతోషంగా జీవితాన్ని గడపాలి. ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఒకరికి ఒకరు భరోసా ఇవ్వాలి. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు.

 సాధారణంగా అయితే దంపతుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు.. వారి బంధం మరింత బలపడుతుంది అని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి చిన్న గొడవలే నేటి రోజుల్లో విడాకులకు కారణమవుతున్నాయి అని చెప్పాలి. అర్థం చేసుకొని సర్దుకుపోయే గుణం ఎవరిలో కనిపించడం లేదు. దీంతో ఈగోలకు పోయి చివరికి పచ్చటి కాపురంలో చేతులారా చిచ్చు పెట్టుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఎంతోమంది వింతైన కారణాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇప్పుడు ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. తన భార్య ఇంటి పని చేయమని అడిగితే చేయను అంటూ చెబుతుందని.. అంతే కాకుండా తల్లిదండ్రులను విడిచి వేరే కాపురం పెట్టాలని ఇక ఒత్తిడి తీసుకువస్తుంది అంటూ ఒక వ్యక్తి చివరికి కోర్టును ఆశ్రయించాడు. ఇలాంటి భార్య తనకు వద్దని విడాకులు ఇప్పించాలి అంటూ కోరాడు. అయితే అతని పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్త తన భార్యను ఇంటి పని చేయమనడం తప్పు కాదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భార్యను ఇంటి పని చేయమని చెప్పడం తప్పు కాదు. దంపతులిద్దరు బాధ్యతలను పంచుకోవడమే వైవాహిక బంధం అని పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు.. చివరికి అతని విజ్ఞప్తిని మన్నించి విడాకులు మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: