విషాదం : మ్యాచ్ ముగిసింది.. గుండె ఆగింది?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఇప్పటికే కరోనా వైరస్ సహ ఎన్నో రకాల వ్యాధులు మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చాలవు అన్నట్లు ఈ మధ్యకాలంలో సడన్ హార్ట్ ఎటాక్లు కూడా మనుషుల ప్రాణాలను చూస్తూ చూస్తుండగానే గాల్లో కలీపేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు సంతోషంగా ఆనందంగా గడిపిన వారు ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందా అని గ్రహించే లోపే చివరికి వారి ప్రాణం గాల్లో కలిసిపోతూ ఉంది అని చెప్పాలి.

 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి. ఏ క్షణంలో ప్రాణాలు పోతాయి అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది యువకులు క్రికెట్ ఆడుతూ కూడా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా గల్లి క్రికెట్లో ఎంతోమంది యువకులు ఇలా సడన్ హార్ట్ ఎటాక్లతో ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రొఫెషనల్ క్రికెట్లో మాత్రం ఇలాంటిది ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రొఫెషనల్ క్రికెట్లో తొలిసారి ఒక క్రికెటర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు.

 కర్ణాటకలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఏఈజీ సౌత్ జోన్ టోర్నీలో తమిళనాడుతో ఇటీవలే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో 34 ఏళ్ళ క్రికెటర్ ఓయ్ సలా కూడా ఆడాడు. ఇక తమిళనాడుతో జరిగిన మ్యాచ్ అనంతరం కర్ణాటక ప్లేయర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు అందరూ కూడా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. అతని మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో సహచర ఆటగాళ్లు అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: