రోడ్డుపై విపరీతమైన గుంతలు.. చనిపోయిన వ్యక్తి బ్రతికాడు?

praveen
సాధరణంగా రోడ్లు గుంతల మయంగా ఉన్నాయ్ అంటే చాలు ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే రోడ్లపై ఉన్న గుంతల కారణంగా ఇక ఎన్నో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఇక ఎంతోమంది వాహనం అదుపుతప్పి పడిపోయి చివరికి గాయాల బారిన పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోడ్ల మరమ్మత్తులు చేయించాలి అని వాహనదారులు ఎప్పుడు అటు ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు కూడా గుంతల మయంగా మారిన రోడ్లను చూపిస్తూ ఇక అధికార పార్టీపై విమర్శలు చేయడం కూడా చేస్తూ ఉంటారు.

 ఇలా గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రతిరోజు ప్రయాణించడం కారణంగా వెన్ను నొప్పి లాంటి ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు వాహనదారులు. ఇలా గుంతలతో అద్వాన పరిస్థితిలో ఉన్న రోడ్ ఎవ్వరికి నచ్చదు. కానీ ఇలాంటి రోడ్డు కారణంగా ఏకంగా ఒక ప్రాణం నిలబడింది అంటే నమ్ముతారా.. ఊరుకోండి బాసూ.. గుంతల మయంగా మారిన రోడ్డులో ప్రయాణిస్తే ప్రాణం పోతుంది. కానీ మనిషి ప్రాణం నిలబడటం ఏంటి అంటారు ఎవరైనా.. అయితే ఇక్కడ నిజంగానే ఇది జరిగింది. ఎందుకంటే చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారించిన వ్యక్తి మళ్ళీ రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బతికాడు.

 ఈ ఆశ్చర్యకర ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల దక్షిణ్ సింగ్ అనారోగ్య కారణాలతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. అయితే అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళుతూ ఉండగా అంబులెన్స్ గుంతల మీదుగా వెళ్లడంతో దర్శన్ తో మళ్ళీ కదలికలు వచ్చాయి. దీనిని గమనించిన ఆయన మనవడు వెంటనే ఆసుపత్రికి తరలించారు  ఇక దర్శన్ ప్రాణాలతోనే ఉన్నాడని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సదరు వ్యక్తిని మళ్లీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: