ఆంధ్రా వ్యాపారులకు.. మోదీ బంపర్‌ ఆఫర్‌?

Chakravarthi Kalyan
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా నిలదొక్కకునేందుకు వివిధ రకాల స్కీంలను ప్రవేశపెడుతూ ఉంది. అలాగే చిన్న వీధి వ్యాపారులు తమ సొంత వ్యాపారం ప్రారంభించేందుకు కావాల్సిన పెట్టుబడికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సరసమైన ధరలకు రుణ సదుపాయాన్ని కల్పించింది. ఆ పథకమే పీఎం స్వానిధి యోజన.
కరోనా సమయంలో చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా దేశంలో చాలామంది లబ్ధి పొందారు. దీని ద్వారా కేంద్రం ఇప్పటి వరకు సుమారు 70లక్షల మందికి పైగా ఆర్థిక సాయం అందించింది. దీని ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.50వేల వరకు రుణాలు పొందవచ్చు.
ఈ పథకం కింద మొదటి సారి ఎలాంటి హామీ లేకుండా రూ.10వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అలాగే తీసుకున్న రుణాన్ని 12 నెలల్లోపు మొత్తాన్ని తిరగి చెల్లించవచ్చు. అంటే సుమారు నెలకు రూ.1000 చొప్పున కట్టాలి. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో సారి రూ.20 వేల మూడో సారి రూ.50 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. దీనికోసం సదరు బ్యాంకు కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకాన్ని ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం పేరు మార్చి మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.  ఈ మేరకు రాష్ట్రంలోని వీధి వ్యాపారులు 3,21,449 మందికి తొలి విడతగా రూ.10 రుణాన్ని అందించింది. రెండో విడత  రూ.20 వేల రుణాన్ని 92,850మందికి, మూడో విడత రూ.50 వేల రుణాన్ని 13,333మంది రుణాలు అందుకున్నారు.  ఇది ఏపీ ప్రజలకు కేంద్రం చేసిన మేలు. కానీ పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: