పెట్రోల్ రేట్ కంటే.. కిలో టమాట ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే?

praveen
ఇప్పటికే కూరగాయలు రేట్లు మండిపోతు అటు సామాన్యుడికి భారంగా మారగా.. ఇప్పుడు టమాటా రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడి జోబుకి చిల్లు పెడుతున్నాయ్ అని చెప్పాలి.  దీంతో ఇక మార్కెట్లోకి వెళ్లి టమాటాను కొనుగోలు చేయాలంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న సామాన్యులు ఇక టమాటా లేకుండానే ప్రస్తుతం వంటకాలు చేస్తున్న దుస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కేవలం ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా టమాటా ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.

 వర్షాల కారణంగా టమాటా పంటలు నాశనం అవ్వడం.. దీంతో ఇక దిగుబడి తగిపోవడం మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ఇలా టమాటాకు ఉన్న ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే మొన్నటి వరకు పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అని సామాన్యుడికి భారంగా మారిపోయాయని అందరూ లబోదిబోమన్నారు.  కానీ కొన్ని రాష్ట్రాలలో ఏకంగా టమాటా ధరతో పోల్చి చూస్తే పెట్రోల్ రేట్లు నయం అనే విధంగా ఉన్నాయి. ఇలా టమాటా రేట్లు పెట్రోల్ ధర కంటే ఎక్కువగా పెరిగిపోవడంతో సామాన్యులు మరింత బెంబేలెత్తిపోతున్నారు.

 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా టమాటా రేట్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పెట్రోల్ ధరలు కంటే కేజీ టమాట ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవో తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధర 110.48 ఉంది. కానీ అక్కడ టమాటా ధర మాత్రం 160 రూపాయలు పలుకుతూ ఉండడం గమనార్హం. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర 16 రూపాయలుగా ఉండగా.. టమాటా ధర మాత్రం 155 నుంచి 160 మధ్యలో ఉందట. ఢిల్లీలో పెట్రోల్ ధర 96.72 రూపాయలుగా ఉండగా.. టమాటా కిలో ధర మాత్రం 130 రూపాయలు పలుకుతుందట. యూపీలో పెట్రోల్ ధర 97.3రూపాయలుగా ఉండగా టమాటా ధర మాత్రం 150 రూపాయల వరకు పలుకుతుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: